అసెంబ్లీ సమావేశాలు, ధాన్యం కొనుగోళ్లపై చర్చ
కెసిఆర్ అధ్యక్షతన సాయంత్రం ప్రగతి భవన్లో సమావేశం
తెలంగాణ కేబినెట్ శనివారం సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు, ధాన్యం కొనుగోళ్లపై చర్చించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన జిహెచ్ఎంసి బిల్లులపై కేబినెట్లో చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో రైతులు సాగు చేసిన పంటను యాసంగి కాలానికి ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఇప్పుడు వార్షాకాలం సాగు చేసిన పంటలు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఐదువేలకుపైగా కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల్లోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు ఈ యాసంగిలో ఏ పంట వేస్తే లాభం అనే అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ శనివారం ఉదయం సవి•క్ష సవి•వేశం నిర్వహించనున్నారు. అనంతరం కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో ప్రధానంగా వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటసాగు విధానం.. అలాగే ధాన్యం కొనుగోలుపై ఈ కేబినెట్లో చర్చించనున్నారు. మరోవైపు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ యాక్టు కూడా సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఈ నెల 13న అసెంబ్లీ, 14న శాసనమండలి సమావేశం నిర్వహించబోతోంది. దీనిపై కూడా కేబినెట్లో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
హైకోర్టు సూచనల మేరకు మరికొన్ని బిల్లులను కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ వి•టింగ్ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన చట్టసవరణ బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానం అమలు, ధాన్యం కొనుగోలుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం కంటే ముందే.. మధ్యాహ్నం 2:30 గంటలకు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవి•క్ష నిర్వహించనున్నారు. గ్రామాల్లోనే పంటల కొనుగోలుపై అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్నది. దీని వల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.