Take a fresh look at your lifestyle.

నేడు ఉపాధ్యాయ దినోత్సవం..మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధా కృష్ణన్‌ ‌జయంతి

  • పతనావస్థలో ఉపాధ్యాయుని కీర్తి ప్రతిష్ఠలు
  • తండ సదానందం, టీపీటీఫ్‌ ‌జిల్లాఉపాధ్యక్షుడు,మహబూబాబాద్‌

‌మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవం అని గురువుకు సముచిత స్థానం కల్పించారు. పిల్లలలు తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయుడు వారి జ్ఞానానంధ కారాన్ని తొలగించి జీవితంలో వెలుగు ప్రసాదించి సమాజంలో ఉన్నతులుగా నిలిపేందుకు బాధ్యత తీసుకుంటారు. ఉపాధ్యాయ వృత్తి మిగిలిన డాక్టర్ల, ఇంజనీర్ల, లాయర్ల మాదిరిగా ఒక సాధారణ వృత్తి కాదు. తరగతినుంచి ఒక సమాజాన్ని తయారు చేయడం. అందుకే ఫాలో పెయిరీ మహోపాధ్యాయుడు, ‘‘ఉపాధ్యాయుడు ఒక సాంస్కృతిక కార్యకర్త’’ అంటారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడు కీలక పాత్ర నిర్వహ్సితాడు. తరగతి గదిలోని పిల్లలలో బోధనతో మార్పు తీసుకువచ్చే ప్రధాన సాధకుడు ఉపాధ్యాయుడు. అందుకే అంబేడ్కర్‌ ‌విద్య ద్వారా సమాజ పరివర్తన తీసుకురావాలి అన్నారు. ఉపాధ్యాయుని సోషల్‌ ఇం‌జనీర్‌ అం‌టారు. గత తరంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన ఆదర్శ పురుషులు, మహానుభావులు మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, ఏపీజే అబ్దుల్‌ ‌కలాం లాంటివారు ముందువరుసలో ఉన్నారు. సామాన్య ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులు అలంకరించిన రాధాకృష్ణన్‌ ‌పుట్టిన రోజును ఆయన గౌరవార్ధం ఉపాధ్యాయ దినోత్సవం పాటిస్తున్నాం.

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1888 ‌సెప్టెంబర్‌ 5‌న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తిరుత్తణిలో సామాన్య కుటుంబంలో వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. రాధాకృష్ణన్‌ ‌బాల్యం నుంచే చురుకైన వ్యక్తి. 21 సంవత్సరాలకే మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ కళాశాలలో ఆచార్యునిగా నియమితులయ్యారు. కలకత్తా, బెనారస్‌, ‌మైసూర్‌ ‌విశ్వవిద్యాలయాల్లో ఆచార్యునిగా పనిచేశారు. మైసూర్‌ ‌విశ్వవిద్యాలయం నుంచి బదిలీ అయినప్పుడు విద్యార్థులు స్వయంగా గుర్రపు బగ్గీలో కూర్చుండబెట్టి రైల్వే స్టేషన్‌ ‌వరకు తీసుకువెళ్ళారు. ఆయనపట్ల విద్యార్థులకు ఎంత ఆదరాభి మానాలున్నాయో తెలుస్తుంది. ఆయన తత్వవేత్తగా, భారత రాయబారిగా, విద్యా సంస్కరణల కమిటీ చైర్మెన్‌ ‌గా, ఉపరాష్ట్రపతిగా రెండు పర్యాయాలు, రాష్ట్రపతిగా ఉత్తమ సేవలందించినందుకు గాను 1954లో అత్యుత్తమ భారతరత్న అవార్డును అందుకున్నారు. ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు అనుమతిని కోరగా, నిరాకరించి వారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. 1969 నుండి ప్రతి సెపెటెంబరు 5 వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవం జరపాలని భారతప్రభుత్వం నిర్ణయించింది.

ప్రాచీన కాలంలో ఉపాధ్యాయుడు గురుకులాలలో విద్యార్థులతో కలిసి జీవిస్తూ విద్యబొఢించేవారు. యుక్త వయసు రాగానే విద్యాభ్యాసం ముగించి జీవితంలో స్థిరపడే పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దే వారు. విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉండేవారు. సమాజంలో గురువులకు పెద్దపీట వేసారు. ఉపాధ్యాయుల పట్ల రాజులు కూడా గౌరవ ప్రపత్తులు ప్రదర్శించేవారు. అవసరమైనప్పుడు సూచనలు స్వీకరించేవారు. కాలక్రమేణా పరిస్థితులు మారాయి. బ్రిటిష్‌ ‌పాలనా కాలంలో కూడా ఉపాధ్యాయులపట్ల గౌరవ భావం ఉండేది. ఎక్కువగా మిషనరీ, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలున్నా నైతిక విలువలకు బొధనలో ఉపాధ్యాయు కేంద్ర బిందువయ్యారు. తక్కువ వేతనాలు తీసుకున్నప్పటికీ ఉపాధ్యాయులు సంతోషంగా జీవించేవారు. సాంఘిక సమాజ కట్టుబాట్లను ఎదిరించి విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని భావించిన మహాత్మ జ్యోతిబాపూలే, భార్య సావిత్రిబాయి పూలే కు మొద్ఫట చదువు నేర్పి ఆమెను మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. ఎన్నో ఆటంకాలు ఎదురైనా, బలహీన వర్గాల బాలికల కోసం పాఠశాలను నెలకొల్పి విద్యాగంధం అందించారు.

స్వాతంత్రానంతరం కూడా పాలకులు గుమస్తా గిరి ప్రోత్సహించే విద్యా విధానాన్ని అమలు పరుస్తున్నారు. 1948 -49 లో ఏర్పడిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌కమిషన్‌ ‌నుండి నేటి కస్తూరి రంగన్‌ ‌నివేదిక వరకు అనేక కమిటీలు మూడు జాతీయ విద్యా విధానాలు అమలుపరిచినా ఉపాధ్యాయుని అంతస్తులో, హోదాలో మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. ఉపాధ్యాయ సంక్షేమం చేసింది తక్కువ…. 1990లో నూతన ఆర్థిక సరళీకృత విధానాలు అమలు ప్రారంభమయ్యాక విద్య ఫక్తు వ్యాపార వస్తువైంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణతో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్‌ ‌పాఠశాలసంఖ్య పెరిగి ఉపాధ్యాయుల సామాజిక హోదా క్షెణమార్గం పట్తింది. విద్యా బొధనలో ఉపాధ్యాయుడికి స్వేచ్ఛలేకపోవడం వలన తరగతిగదిలో ర రకాల ప్రయోగాలు మొదలయ్యాయి. ఏపెప్‌ ,‌డిపెప్‌, ‌క్లిప్‌, ‌క్లాప్‌, ‌కిప్‌, ‌ల్యాప్‌, ఎల్‌ఇపి, సర్వ శిక్ష అభియాన్నే మొదలు సిసిఇ వరకు పలు పథకాలు అమలు లోకిరావడంతో విలువల సంక్షోభంతో పాటు ఉపాధ్యాయుని ప్రతిష్ట దిగజారింది.

ఉపాధ్యాయుని చేతిలో బెత్తం లాగేయడంతో సమాజంలో శాంతిభద్రతలు లోపించాయి. తల్లిదండ్రుల బాధ్యతలు పెరిగి, చిన్న కుటుంబాలు కావడంతో గారాబం పెరిగి పాఠశాల ప్రాయంలో వారిని మందలించి సరి చేసే విధానం మాయమైంది. ఉపాధ్యాయులు సైతం పఠ్యాంశాలను వేయించడం వరకే పరిమితమవుతున్నారు. ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు విద్యార్థుల పై మీడియా, ఇంటర్నెట్‌, ‌సినిమా, టీవీ సీరియల్‌ ‌లాంటివి ప్రభావం చూపడంతో ఉపాధ్యాయులు నిస్సహాయులవుతున్నారు. బోధన సామర్ధ్యాలను మెరుగుపరిచేందుకు సరైన వాతావరణం కల్పించక, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టక పోకుండానే విద్యా సంవత్సరాలు ముగిసి పోతున్నాయి. అరకొర వసతులతో ప్రభుత్వ పాఠశాలలు కునారిల్లుతుంటే ప్రైవేట్‌ ‌పాఠశాలలకు కార్పొరేట్‌ ‌పాఠశాలలకు దారులు తెరుచుకున్నాయి. అయినా ఎప్పటికప్పుడు విద్యా ఆయుధాన్ని అర్హులకు అందించేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తునే ఉన్నారు. ఉపాధ్యాయులకు న్యాయంగా అందవలసిన ఆర్దిక సౌకర్యాలు అందించకుండా.. పని లేకున్నా ఉపాధ్యాయులు వేతనాలు పొందుతున్నారని ప్రచారం చేయడం వలన ఊపాధ్యాయుల పట్ల సమాజంలో వ్యతిరేక భావం ఏర్పడింది.

పదవీ విరమణ తర్వాతకూడా గౌరవప్రదమైన బ్రతుకు లేకుండా సామాజిక భద్రతకోల్పోయేలా పెన్షన్‌ ‌టెన్షన్‌ ‌కొనసాగించడం పాలకులకు తగదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోరాడి సాధించి రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా భూమికను పోషించి, ప్రత్యక్ష కార్యాచరణ లో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రం సాధిన్న తాము నిరాదరణకే గురవుతున్నామన్న బాధ ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతున్నది. జాతి నిర్మాతలైన ఉపాధ్యాయులను విస్మరించడం ఏ మేరకు సమంజసం? గురువు లేని విద్య గుడ్డి విద్య అనే విషయం తెలుసుకుని, ప్రభుత్వం గురువుకు గౌరవప్రదమైన హోదాను కల్పించి గౌరవించాలి. ప్రభుత్వం గత ఆరేళ్లుగా విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయులతో మాట్లాడింది లేదు. పిఆర్సి, ఐ ఆర్‌, ‌డి ఏ, ఉమ్మడి సర్వీస్‌ ‌రూల్స్, ‌ప్రమోషన్లు, రిక్రూట్మెంట్‌, ‌సరిపడే సబ్జెక్ట్ ‌టీచర్లు, విద్యావాలంటీర్లు కూడా లేరు.. పాఠశాలల్లో కనీస సదుపాయాలు, శూన్యం. పర్యవేక్షక అధికారులు లేరు. గంపెడు సమస్యలతో సతమతమవుతూ కూడా ఉపాధ్యాయులు కర్తవ్యనిర్వహణలో మునిగిన పట్టించుకునే నాధుడే లేడు. కరోనా వైరస్‌ ‌విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నది. విద్యా రంగం కుప్పకూలింది. పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. పిల్లలు, ఉపాధ్యాయులకు మానసిక సంక్షోభం అనుభవిస్తుండగా సెప్టెంబర్‌ 1 ‌నుండి ఆన్లైన్‌ ‌తరగతులు ప్రారంభమయ్యాయి. యునెస్కో కూడా ఉపాధ్యాయుడి అంతస్తు హోదాను అత్యున్నతంగా ఉంచాలని సూచించింది. సమాజ నిర్మాణం కోసం బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ దినోత్సవం ఒక్క రోజు ఆకాశానికి ఎత్తితే ఏమి ప్రయోజనం? ఉపాధ్యాయుల సంక్షేమానికి కొఠారి కమిషన్‌ ‌చెప్పినట్లు అధిక నిధులు కేటాయించి కామన్‌ ‌స్కూల్‌ ‌విధానం అమలు చేసి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించిన నాడే నిజమైన ఉపాధ్యాయ దినోత్సవం. ఆ రోజు కోసం వేచి చూద్దాం..

Leave a Reply