Take a fresh look at your lifestyle.

నేడు సద్దుల బతుకమ్మ

  • కొరోనాతో కొరవడిన సందడి
  • పల్లెలతో సహా పట్టణాల్లోనూ కానరాని పండుగ జోష్‌

‌‌తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ తుది అంకానికి చేరింది. నేటి సద్దుల బతుకమ్మతో పండగ ముగియనుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా వరదలు ముంచెత్తడడంతో హైదరాబాద్‌ ‌తదిర ప్రాంతాల్లో బతుకమ్మ కళ తప్పింది. ఇక కొరోనాతో బతుకమ్మ ఆడాలన్న మక్కువ ఉన్నా గత వారం రోజులుగా పెద్దగా సందడి లేకుండా సాగుతోంది. ఊరూవాడా వారం రోజులుగా బతుకమ్మ పండగ జోరుగా సాగాల్సి ఉన్నా కొరోనాతో ఆడపడచులు భయంభయంగా బతుకమ్మను ఆడిపాడారు. ఆడపడుచుల రాకతో గ్రామాలు కళకళలాడాల్సి ఉన్నా ఎక్కడా పెద్దగా సందడి కానరాలేదు. గతంలో సద్దుల బతుకమ్మ వేడుకలుకు పల్లెలు మొదలు పట్టణాల వరకు ముస్తాబయ్యేయి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా బతుకమ్మను నిర్వహించేవారు.

సిద్దిపేట, వరగంల్‌ ‌తదితర పట్టణాల్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రకృతి రమణీయకతకు బతుకమ్మ నిదర్శనం. ఆశ్వయుజ మాసం శుద్ధ పాఢ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను వేడుకగా జరుపుకుంటారు. రంగురంగుల పూలను త్రికోణాకృతిలో పేర్చి, అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ..ఆడి, పాడతారు. అప్పుడు మహిళలు పాడే పాటలు మనసుకు హత్తుకుంటాయి. ఏరోజు ప్రత్యేకత ఆ రోజుదే. ఇలా తొమ్మిది రోజులు ఆడిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి, నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఆడపడుచులంతా పంచుకుంటారు. తొమ్మిదో రోజు వేడుకగా సద్దుల బతుకమ్మను నిర్వహించి గౌరీదేవిని సాగనంపుతారు. పూలతో బతుకమ్మ ఆవిర్భవించడం, ఆటపాటలతో అలరింతగా వేడుక చేయడం, నిమజ్జనంతో అనంత ప్రకృతిలో సంలీనం కావడం అనేవి- జగన్మాత సృష్టి, స్థితి, లయాత్మక తత్వాలకు సంకేతాలుగా భావించాలి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply