Take a fresh look at your lifestyle.

‘‌యాచక దశ నుండి తెలంగాణ శాసక దశకు రావాలి’’

‘‘‌మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం… ఇదే జీవితం.. ఇందులోనే మరణం!’’ అని ఉద్యమాన్ని శ్వాసించిన మహెరీపాధ్యాయుడు ప్రొఫెసర్‌ ‌కొత్త పల్లి జయశంకర్‌..’’

నేడు ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌వర్ధంతి

‘‘కొత్తపల్లి జయశంకర్‌ ‌యాదిలో జీవిత విశేషాలు’’

తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ ‌కొత్తపల్లి జయశంకర్‌ (ఆగష్టు 6, 1934- జూన్‌ 21, 2011) ‌వరంగల్‌ ‌జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ ‌గ్రామ శివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్‌ ‌తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌ ‌డీ పట్టా పొంది, ప్రిన్సిపాల్‌ ‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌-‌ఛాన్సలర్‌ ‌వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్‌ ‌ముల్కీ ఉద్యమంలో, సాంబార్‌- ఇడ్లీ గోబ్యాక్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పేవారు. జయశంకర్‌ 2011, ‌జూన్‌ 21‌న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.
1934, ఆగస్టు 6న వరంగల్‌ ‌జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట లో జయశంకర్‌ ‌జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంత రావు. ఆయనకు ముగ్గురు అన్న దమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్లు. జయశంకర్‌ ‌తల్లిదండ్రులకు రెండో సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించు కోకుండా, తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి, ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలి పోయారు.

బెనారస్‌, అలీగఢ్‌ ‌విశ్వ విద్యాలయాల నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్‌ ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పీహెచ్‌ ‌డీ చేశారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ ‌లోని సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌ ‌గా పనిచేశారు. 1979 నుంచి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ ‌రిజిస్ట్రార్‌ 1991 ‌నుంచి 1994 వరకు ఆదే యూనివర్శిటీకి ఉప కులపతిగా పని చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1952 లో జయశంకర్‌ ‌నాన్‌ ‌ముల్కీ ఉద్యమంలో, సాంబార్‌, ఇడ్లీ గోబ్యాక్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకునిగా 1954 లో ఫజల్‌ అలీ కమిషన్‌ ‌కు నివేదిక ఇచ్చారు.

కె.సి.ఆర్‌ ‌కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశారు. తెలంగాణ లోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. జయశంకర్‌ ‌తన ఆ ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారు. ‘‘అబ్‌ ‌తొ ఏక్‌ ‌హీ ఖ్వాయిష్‌ ‌హై, వొ తెలంగాణ దేఖ్నా బెర్‌ ‌మర్దనా’’ (ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి. తర్వాత మరణించాలి అని అనేవారు. తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా విదేశాల్లో సైతం  వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరవ లేనిది. ఆచార్య జయశంకర్‌ ‌విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్‌ ‌ముల్కీ, ఉద్యమం లోకి ఉరికి ఆనాటి నుంచి సమరశీల పాత్రను పోషించాడు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్‌. ‌విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్‌ ‌ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన అపర మేధావి కొత్తపల్లి జయశంకర్‌.

అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి, ఆచరించిన మహనీయులు. తెలంగాణ డిమాండ్‌ ‌ను 1969 నుంచి నిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసిన మేధావి ఆయన. తెలంగాణ లోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట గళాన్ని అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద , విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణన్నినాదాన్ని వినింపించిన పోరాట యోధులు.

‘‘మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం… ఇదే జీవితం.. ఇందులోనే మరణం!’’ అని ఉద్యమాన్ని శ్వాసించిన మహెరీపాధ్యాయుడు ప్రొఫెసర్‌ ‌కొత్త పల్లి జయశంకర్‌, ‌రెండేళ్లు గొంతు క్యాన్సర్‌ ‌తో బాధపడ్డారు. మీరు చేయాల్సింది మీరు చేశారు. ఈ సమయంలో నేను ఇక్కడ ఇక ఉండలేను. నేను వరంగల్‌ ‌కు పోతాను. నన్ను పంపండి’ అంటూ ఆయన పుట్టిన గడ్డమీద మమకారంతో వరంగల్‌ ‌వచ్చారు. ఇంట్లోనే వైద్యులు ఆయనకు అన్నిరకాల వైద్యసేవలు అందించారు. 2011 జూన్‌ 6 ‌మంగళవారం రోజున తెల్లవారు జాము నుంచి ఆయన పల్స్ ‌రేట్‌ ‌పడిపోవడంతో ఆక్సిజన్‌ అం‌దించారు. చివరకు అదేరోజు ఉదయం 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు.  ఎమర్జెన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌ ‌గా పనిచేశారు. సీకేఎం కళాశాల అంటేనే, జిల్లాలో ‘‘విప్లవ విద్యార్థి ఉద్యమానికి’’ కేంద్రంగా అప్పట్లో పేరుండేంది. విప్లవకవి  వరవరరావు లాంటి వాళ్లు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమర్జెన్సీ గడ్డురోజుల్లో ఆయన కళాశాలను నడిపి, ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుంచి కాపాడారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్సస్‌ ‌స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవడం సర్వసాధారణమే కానీ, ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని, పేరు పెట్టి పిలవడం, ఒక్క జయశంకర్‌ ‌సార్‌ ‌కు సాధ్యం అంటూ ఆయనకు తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రముఖ సాహీతివేత్త రామశాస్త్రి చెప్పేవారు. జయశంకర్‌ ‌విద్యార్థుల్లో అనేక మంది దేశ విదేశాల్లో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో కేయూ మాజీ ప్రొఫెసర్‌ ఎన్‌. ‌లింగమూర్తి, ప్రొఫెసర్‌ ‌కూరపాటి వెంకట నారాయణ, ప్రొఫెసర్‌ ‌కే. సీతా రామావు తదితరులు అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్‌.

– ‌రామ కిష్టయ్య సంగన భట్ల…
     9440595494

Leave a Reply