Take a fresh look at your lifestyle.

హిమగిరుల వైపు విద్యార్థుల చూపు

“ఆ ‌బాలికకు అప్పుడు సరిగ్గా పదిహేను సంవత్సరాలు పూర్తికాలేదు. కృషి, పట్టుదల, ఒంట్లో సత్తువ ఉండాలే తప్ప పేదరికం అడ్డుకాదని నిరూపించారు వారు. మొక్కవోని సంకల్పం, అకుంఠిత దీక్ష ఆమెను ఎవరెస్ట్ ‌శిఖరాన్ని అధిరోహించేలా చేసింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 సంవత్సరాల 11 నెలల బాలిక 2014 సంవత్సరంలో హిమగిరుల అంచున చేరి భారత కీర్తి పతకాన్ని గగనతలాన ఎగురవేసింది. సదరు బాలికతో పాటు ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేడు గ్రామానికి చెందిన ఆనంద్‌కూడా ఎవరెస్ట్ అధిరోహించిన విషయం విధితమే. ఆ సమయంలో బాలుడు ఇంటర్‌ ‌చదువుతున్నారు. అత్యంత ఎత్తు కలిగిన శిఖరం అధిరోహించడం పట్ల యావత్‌ ‌ప్రపంచం అభినందించిన విషయం విధితమే. ఆ సమయంలో సాహాస యాత్ర ప్రపంచమే నివ్వెరపోయింది. విద్యార్థుల కృత్యం అభినందనీయమని జాతీయ స్థాయి మీడియా బ్యానర్‌ ఐటమ్‌లు ప్రదర్శించిన తీరు మరువలేనిది.”

నేడు నేషనల్‌ ‌మౌంటైన్‌ ‌క్లైంబింగ్‌ ‌డే సందర్భంగా ..
విద్యార్థులు ఎప్పుడూ పుస్తకాల చదువులకే పరిమితం కాకుండా ప్రస్తుత తరుణంలో సాహాసాలు ప్రదర్శించేందుకు ఉత్సుకత చూపుతున్నారు. విద్యార్థి దశ నుంచే సాధారణంగా గ్రామీణ వాతావరణం పరిధిలో చెట్లు, గుట్టల పై గడిపేందుకు ప్రయత్నం చేయడం మనం పరిపాటిగా చూస్తున్నాం. ఆ కోవకు చెందిన ఓ గిరిజన బాలిక సాహాసానికి యావత్‌ ‌ప్రపంచం నివ్వెరపోయింది. దానికి తోడు ఎలక్ట్రానిక్‌, ‌ప్రింట్‌ ‌మీడియా సైతం సాహాసాలు పద్రర్శించిన తీరు పలు ప్రసారా మాధ్యమాల ద్వారా వారి విశేషాలను మంచి శీర్షికలతో ప్రచురించడం వారి లో మనోధైర్యాన్ని రేకేత్తించింది. ప్రస్తుత తరుణంలో నేటి విద్యార్థులు దేశంలోని అత్యున్నత శిఖరాలైన హిమగిరి పర్వతాలను అధిరోహించేందుకు సన్నద్ధులు అవుతున్నారు. ఆగస్టు 1 ‘ నేషనల్‌ ‌రాక్‌క్లైంబింగ్‌ ‌డే ’ సందర్భంగా కథనం.

1911 కు ముందు హిమగిరుల అధిరోహించేందుకు ఎవ్వరూ కూడా సాహాసించలేదు. 1911 సంవత్సరం వరకు కూడా ఎవరెస్టు శిఖరంపై చేరుకునేందుకు ప్రయత్నం చేయలేదు. 1911 సంవత్సరం చివరి మాసంలో శిఖరాన్ని చేరేందుకు ప్రయత్నించినా వారి ఆశలు సఫలం కాలేదు. దీంతో అప్పటి కాలం నుంచి యువత చూపు హిమగిరుల వైపు మల్లింది. సదరు పర్వతాలను చేరాలంటే క్లిష్టమైన సాధన, సాధనకు తోడు ధైర్యం మెండుగా ఉండాలి అలాంటి కార్యదక్షత కలిగిన వారు శిఖరం అధిరోహించేందుకు అర్హులుగా పరిగణిచడం జరుగుతోంది. శిఖరాల పరిసర ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉంటుంది. మైనస్‌ ‌డిగ్రీల చలిని తట్టుకోగల దేహధారుడ్యం ఉండాలి. అడుగడుగునా మృత్యువు పొంచి ఉంటుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాక్‌క్లైంబింగ్‌కు సిద్ధపడాలి.

తొలుత సునిశిత పరిశీలన, ధైర్యసాహాసాలు ప్రదర్శించే కోవకు చెందిన టెన్సింగ్‌, ఎడ్మండ్‌ ‌హిల్లరీలు. 1953లో శిఖరం అంచును చేరేందుకు సంకల్పించారు. అదే సంవత్సరం మౌంట్‌ ఎవరెస్ట్‌శిఖరం అధిరోహాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతికూల వాతవరణాన్ని తట్టుకుని వెళ్తుండగా ఎన్నో అడ్డకుంలు ఎదుర్కొన్నారు. చివరగా 1953 మే 29వ తేదీన మౌంట్‌ ఎవరెస్ట్ ‌శిఖరాన్ని అధిరోహించి తొలి రికార్డును సొంతం చేసుకున్నారు. 29వేల 28 అడుగుల శిఖరాన్ని చేరుకోవడంలో కృత కృత్యులయ్యారు. వారితోవను అనుసరిచేందుకు మన తెలంగాణ విద్యార్థి దళం పూనుకుంది. ఫలితంగా తెలంగాణ గురుకుల విద్యార్థుల దృష్టిని సాహస కృత్యాలవైపు మళ్లించేందుకు నాటి తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌.‌ప్రవీణ్‌కుమార్‌ ‌తొలి ప్రయత్నం చేశారు.

prajatantra news online, political updates, telugu news today, telangana updates

విద్యార్థులకు చదువు)తో పాటు పర్వతారోహాణకు కావాల్సిన ధైర్యసాహసాలు కలిగిన విద్యార్థులను గుర్తించారు. పర్వతారోహాణం అనే ఒక కృత్యం. అందాలను ఆస్వాదించే అనుభూతి ఉండాలి. మంచుకొండలను తమను తాము పరిచయం చేసుకునే ధీరత్వం కలిగి ఉంటూ మానసిక సంసిద్ధత వ్యక్తపరచాలి. అందుకు ప్రత్యేక శిక్షణ కావాలి. శిక్షణకు అవసరమైన శిక్షకుడు కూడా ఉండాలి. వెన్ను తట్టి ప్రొత్సహించే శిక్షణలో రాటు దేలాలి. సదరు శిక్షణలో కఠిన సాధన అవసరం. సాధన, సమయస్ఫూర్తి, ప్రత్యేక నైపుణ్యం కలిగిన విద్యార్థులకు గతంలో శిక్షణ పొందారు. అలా శిక్షణం పొందిన వారిలో మన ప్రాంతం వారు (తెలంగాణ) మాలావత్‌ ‌పూర్ణ, ఆనంద్‌లు.

నిజామాబాద్‌ ‌జిల్లా తాడ్వాయికి చెందిన గిరిజన బాలిక మాలావత్‌ ‌పూర్ణ. ఆ బాలికకు అప్పుడు సరిగ్గా పదిహేను సంవత్సరాలు పూర్తికాలేదు. కృషి, పట్టుదల, ఒంట్లో సత్తువ ఉండాలే తప్ప పేదరికం అడ్డుకాదని నిరూపించారు వారు. మొక్కవోని సంకల్పం, అకుంఠిత దీక్ష ఆమెను ఎవరెస్ట్ ‌శిఖరాన్ని అధిరోహించేలా చేసింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 సంవత్సరాల 11 నెలల బాలిక 2014 సంవత్సరంలో హిమగిరుల అంచున చేరి భారత కీర్తి పతకాన్ని గగనతలాన ఎగురవేసింది. సదరు బాలికతో పాటు ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేడు గ్రామానికి చెందిన ఆనంద్‌కూడా ఎవరెస్ట్ అధిరోహించిన విషయం విధితమే.

prajatantra news online, political updates, telugu news today, telangana updates

ఆ సమయంలో బాలుడు ఇంటర్‌ ‌చదువుతున్నారు. అత్యంత ఎత్తు కలిగిన శిఖరం అధిరోహించడం పట్ల యావత్‌ ‌ప్రపంచం అభినందించిన విషయం విధితమే. ఆ సమయంలో సాహాస యాత్ర ప్రపంచమే నివ్వెరపోయింది. విద్యార్థుల కృత్యం అభినందనీయమని జాతీయ స్థాయి మీడియా బ్యానర్‌ ఐటమ్‌లు ప్రదర్శించిన తీరు మరువలేనిది. వారి గర్వోన్నతిని చాటేలా కథనాలు రూపొందించింది. ఆ సమయంలో భారత జాతి ప్రజలు సర్వత్రా జేజేలు పలుకుతూ.. పూలవర్షం కురిసించిన సంఘటనలు మరువలేనివి. దీంతో ఇండియా పులకించిపోయింది. సదరు విద్యార్థులకు (పూర్ణ, ఆనంద్‌)‌లకు భారీ నజరానాలు కూడా అందిపుపచ్చుకున్నారు. వారి స్ఫూర్తి మంత్రమే యావత్‌ ‌భారతావనికి ఆదర్శంగా నిలుస్తూ ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.
– భర్తాపురం వెంకటమల్లేష్‌
9949872371

Leave a Reply