Take a fresh look at your lifestyle.

నాడు చికాగోలో ఎనిమిది గంటల పనిదినం కోసం గొంతెత్తిన కార్మిక వర్గం..!

నేడు కొరోనా ఉద్దృతికి పొట్టకూటి కోసం తిరుగు ప్రయాణంలో వలస కార్మికులు ..!!
అమెరికాలోని చికాగోలో 1886 మే 1న కార్మిక చట్టాల అమలుకై 18 గంటల పని దినాన్ని వ్యతిరేకిస్తూ.. ఎనిమిది గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ కార్మిక వర్గం పోరాటం చేసి కొన్ని హక్కులను సాధించింది. ఆ ఉద్యమంలో అనేక మంది కార్మికులు అమరులయ్యారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం నెలకొన్న కార్మికుల హక్కుల రక్షణ కోసం మేడే వేడుకలను కార్మిక సంఘాలు నిర్వహిం చుకుంటున్నాయి. మేనెల ఒకటో తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మేడే’ కానీ అమెరికాలో మాత్రం దీన్ని ‘లాయల్టీ డే’గా వ్యవహరిస్తున్నారు. పలు దేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావం ఏ ఒక్క దేశం, సంఘటనకో పరిమితం కాదు. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు నాంది పలికింది.

ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం ప్రారంభించారు. దీనికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. కానీ ఇది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ‘మేడే’ గురించి ఐరోపాలోని సోషలిస్ట్ ‌పార్టీలు మొదటి అంతర్జాతీయ కాంగ్రెస్‌ ‌జూలై 14, 1889న ఫ్రాన్స్ ‌లోని పారిస్లో ప్రకటించిన తర్వాత 1890 మే 1నమొట్టమొదటి మేడే వేడుకలు జరపుకున్నారు. అప్పటనుంచి ప్రతి ఏడాది మే 1న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం..దీన్ని అంతర్జాతీయ ‘కార్మిక దివాస్‌‘‌గా కూడా పిలుస్తారు. 1923లో తొలిసారిగా భారత్లో ‘మే డే’ను పాటించారు. ప్రపంచంలో అనేక దేశాలు మే దినోత్సవాన్ని సెలవు రోజుగా ప్రకటించాయి. భారతదేశం మే 1 ని సెలవు రోజుగా పరిగణించింది. కాని క్రమేణా ఈ సెలవు తీసేశారు. భారతదేశం మే 1 ని 1923 లో మొదటిసారిగా లేబర్‌ ‌కిసాన్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో మద్రాసు (ఇప్పడు చెన్నై) లో జరుపుకొంది. కార్మిక ఫ్రీ పురుషుల గౌరవార్థం ఈ రోజు కార్మికులు ఎర్రని జెండాలు ఎగురవేస్తారు. మేడేకు కారణభూతమైన చికాగో కాల్పుల్లో మరణించిన కార్మిక మృతవీరుల రక్తపు రంగుకు సంకేతంగా ఎర్ర జండా ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా 80 దేశల్లో ఈ ఉత్సవం అధీకృతంగా జరుగుతుంది. భారతదేశంలో శ్రామికులకు రోజుకు 8 పని గంటలు ప్రవేశపెట్టడానికి, స్త్రీ పురుషులకు ఒక పనికి సమాన వేతనం ఇవ్వడానికి డా. బి.అర్‌. అం‌బేద్కర్‌ ‌మూల కారణం.

ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం…
1889 నుంచి అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి. 1890, మే 1న బ్రిటన్లోని హైడ్‌ ‌పార్క్లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్‌. ఆ ‌పైన అనేక ఐరోపా దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. ఆపై ప్రపంచవ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. 1886లో ఆరంభమైన ఈ కార్మిక ఉద్యమం వందేళ్ళ పండగ జరుపుకుంది. ప్రపంచంలో ఎనిమిది గంటల పనికోసం చేసిన పోరాటం పెట్టుబడిదారీ వర్గం పతనానికి ఆరంభమవుతుందనుకున్నాం. కానీ మళ్ళీ మార్కెట్‌ ‌శక్తులు పాత పరిస్థితులకు ప్రాణప్రతిష్ట చేస్తున్నాయి. ఆనాటి కార్మికవర్గ చైతన్యం మరోసారి వెల్లివిరుస్తుందని, ఈ మేడే నాడు కొత్త స్ఫూర్తిని రగిలిస్తుందని ఆశిద్దాం. ప్రపంచీకరణ, సామ్రాజ్య వాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు, మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మికవర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి. ప్రపంచ శాంతిని అసలు ఈ భూగోళాన్నే కాపాడుకోవాల్సిన అవసరం కూడా వుంది. అందుకు కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే. ఆ రకంగా ఈ మేడే మనకు కొత్త స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.

మాటల్లో కాకుండా చేతల్లో కనబడాలి..
దేశవ్యాప్తంగా లాక్‌ ‌డౌన్‌ ‌విదించుతారనే భయంతో ఇప్పుడిప్పుడే గాడిన పడుచున్న వలస కార్మికుల జీవితాలకు పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. సెకండ్‌ ‌వేవ్‌ ‌తో మల్లి తిరుగు ప్రయాణాలు పునరావృతమవుతున్నాయి.కరోనా వైరస్‌ ‌వ్యాప్తి పెరుగుతున్న జాడలు కనబడటంతో రాత్రి పూట ఖర్ప్యూ విదించడానికి చర్యలు తీసుకున్నారు.ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్‌ ,‌మహారాష్ట్ర, కర్ణాటకలో లాక్‌ ‌డౌన్‌, అక్కడక్కడ కొన్ని పరిమితులు విధించారు కొన్నిచోట్ల రాత్రిపూట ఖర్ప్యూ చేస్తున్నారు .ఈ పరిస్థితిలో లాక్‌ ‌డౌన్‌ ‌విదించుతారనే భయంతో వారి,వారి స్వస్థలాలకు ముల్లే,మూట సర్థుకొని తిరుగు ప్రయాణం కావదం వలన బస్‌ ‌స్తేషన్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసి పోతున్నాయి. కొందరు ఈ ప్రచారంను విశ్వసించడం లేదు. దీనితో చిన్న చిన్న వ్యాపారాలు మూతపడడం లేదా పాక్షికంగా పని చేయవలసి వస్తుంది. దేశంలో రోజు వారిగా నమోదు అయ్యే కేసులలో 50% మహారాష్ట్ర లో కావడంవల్ల లాక్‌ ‌డౌన్‌ ‌విదిస్తారనీ ఇప్పటికే పోరుగు రాష్ట్రాలలో తలదాచుకునేందుకు , పోట్టకూటికోసం భయలు దేరడం గతంలో పెట్టిన లాక్‌ ‌డౌన్‌ ‌కు కోన్ని గంటల సమయం మాత్రమే ఇవ్వడం వలన వేలాది కుటుంబాలు రోడ్‌ ‌మీదపడ్డ విషయం ఆలోచిస్తున్నారని ,ఈ పరిణామాల వల్ల వలస జీవులకే కాదు చిన్నపరిశ్రమలకు సహితం సహజంగానే ఆందోళన కలిగిస్తాయి. కరోనా తీవ్రమైతే గతంలో మాదిరి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని అనుకుంటున్నారు.

పర్యవసానంగా వలస జీవులు దిక్కులేని పక్షుల అయ్యారు లక్షలాది మంది రోడ్డు మీదకు వచ్చారు వందలాది కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామాలకు నడకదారి పట్టారు.పోలీసులు అడ్డుకున్న ఎండలు మండిపోతున్న ఆకలి బాదిస్తున్న వెనక్కి తగ్గలేదు మార్గం మధ్యలో కోందరు ఆకలితో మరి కొందరు అనారోగ్యంతో కన్నుమూశారు. గత సంవత్సరం చవిచూసిన ఇబ్బందులు ఈ సారి రాకుడ దనే సంకల్పంతో ముందు జాగ్రత్తగానే స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. వలస జీవులు తప్పుపట్టడానికి వీల్లేదు.కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిడం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. గత అనుభవాల రీత్యా వలసకూలీ లో కావలసిన రేషన్‌ ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా అయ్యేలా చూడాలి .గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం డేటా సేకరణకు నిర్ణయించింది.దీనికి సంబంధించిన ముసాయిదా విధానం రూపొం దించింది. ఈ విషయంలో ఏ మేరకు ముందడుగు పడిందో తెలియదు కానీ అలాంటి వలస కార్మికుల నుగుర్తించి ఉంటే వారికి సహాయపడడం సుల భమయ్యేది.తాజా సంక్షోభాన్ని గట్టెక్కించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా అందరిలోనూ భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది మాటల్లో కాకుండా చేతల్లో కనబడాలని, చికాగోలోని కొందరు రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు.. హక్కులకోసం పోరాడిన పాపానికి కాల్పులకు కారణం కార్మిక నాయకులేనని వారి మీద హత్యానేరం మోపబడింది. ‘మేడే’ ఒక చారిత్రాత్మక చైతన్య దినం గా మేధావులు వర్ణించారు.

‘మేడే’ త్యాగాలను విస్మరిస్తున్నారు..
గత మూడేండ్ల నరేంద్ర మోడీ పాలన ప్రభుత్వ రంగాన్ని వేగంగా ధ్వంసం చేస్తున్నది. రెండు దేశవ్యాప్త సమ్మెల్లో ముందుకు వచ్చిన రు.18,000 కనీస వేతన డిమాండు అమలు చేయలేదు. కార్మిక చట్టాలను సవరిస్తూ యాజమాన్యాలకు ఊడిగం చేస్తున్నది. పిఎఫ్‌, ఇఎస్‌ఐ ‌లను బలహీనపరుస్తున్నది. అంగన్వాడీ, ఆషా, మధ్యాహ్న భోజనం తదితర కేంద్ర స్కీములకు నిధులు పెంచడం లేదు. పారిశ్రామికోత్పత్తి మందగించింది. వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడింది. ఉపాధిహామీ పధకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. పెద్ద నోట్లరద్దుతో ఉపాధిని దెబ్బ తీసింది. బిజెపి పాలన ధనికుల, పేదల మధ్య అంతరాన్ని తీవ్రంగా పెంచింది. ప్రజల్లో పెరిగే అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు కుల, మత ఘర్షణలను సృష్టిస్తోంది. ప్రజాతంత్ర హక్కులను కాలరాస్తున్నది. మహిళలు, దళితులు, మైనార్టీలపై మతోన్మాద శక్తులు దాడులను ఉధృతం చేస్తున్నాయి.

ఇన్ని అనర్ధాలకు కారణమైన బిజెపి మేడే కాకుండా విశ్వకర్మ జయంతిని కార్మిక దినంగా జరపాలంటూ మేడే త్యాగాలను విస్మరిస్తున్నది. కార్మికవర్గంలో తప్పుడు భావాలను ప్రచారం చేస్తున్నది. వీటన్నింటిని కార్మికవర్గం విప్లవ చైతన్యంతో ప్రతిఘటించాలి. ప్రస్తుత సంక్లిష్ట స్థితిలో మన ముందున్న సవాళ్ళను అధిగమించడానికి కార్మికవర్గం ఐక్యంగా, సమరశీలంగా ఉద్యమించాలి. ‘’పోరాడితే పోయేదేమీ లేదు – బానిస సంకెళ్ళు తప్ప’’ అన్న నినాదాన్ని తెలంగాణాలో ఆచరణలో ముందుకు తెద్దాం. పాలకుల నిరంకుశ విధానాలను ప్రతిఘటిద్దాం. ప్రత్యామ్నాయ విధానాలవైపు ముందుకు సాగుదాం. అసంఘటిత రంగకార్మికులకు ఉద్యోగభద్రత కరువైంది. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితు ల్లో నిత్యం అభద్రత భావంతోనే గడుపుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నేడు విదేశీయులకు, కార్పొరేట్లకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు..కాబట్టి సహాజంగానే వ్యతిరేకత పెరిగింది, సంఘటిత, అసంఘటిత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్రాలకు ఉన్న తెగువ కేంద్రాలకు లేక పోవడంమే బలమైన కారణంఅని విశ్లేషకులు బావిస్తున్నారు.
(నేడు ‘మేడే’ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)
– డా.సంగని మల్లేశ్వర్‌,‌విభాగాధిపతి జర్నలిజం శాఖ,కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్‌,
‌సెల్‌-9866255355

Leave a Reply