Take a fresh look at your lifestyle.

కవన సూరీడు కాళోజీ !

కలాన్ని కాగడగా పట్టినోడు
అక్షరాన్ని అస్త్రంగా సంధించినోడు

కవన కత్తులు దూసినోడు
మాటల తూటాలు పేల్చినోడు

ధిక్కార స్వరం వినిపించినోడు
ఉద్యమాలకు ఊపిరి పోసినోడు

నిరసన జ్వాలలు రగిల్చినోడు
తిరుగుబాటు బావుటా  ఎగరేసినోడు

ప్రజా పక్షం నిలచినోడు
ప్రజా హక్కుల నినదించినోడు
ప్రజలకై బతుకు ధారబోసినోడు

నిజాం పాలన నిలదీసినోడు
దోపిడీ మూకల తరిమినోడు

తెలంగాణ భాష యాసకు..
వెన్నుదన్నుగా నిలిచినోడు

ఒక్క సిరా చుక్కతో…
లక్షల మెదళ్ళు కదిలించినోడు

జనం గొడవ..
తన గొడవగా తలపోసినోడు

పుట్టుక నీది…చావు నీది …
బతుకు దేశానిదని తేల్చినోడు

తెలంగాణ పోరు పౌరుషం
ప్రపంచమెల్లా చాటి చెప్పినోడు

పద్మ విభూషన్‌ ,‌డాక్టరేట్‌
‌కళాసాగర్‌ ‌ప్రజాకవి మరెన్నో
పురస్కారాలకు వనెలద్దినోడు

అతడే…
అభ్యుదయ భానుడు
కాళోజీ నారాయణుడు

ఆ కవనమూర్తికి
అక్షర నీరాజనాలు
అరుణారుణ వందనాలు
‘‘’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’
(నేడు కాళోజి వర్థంతి సందర్భంగా..)

– కోడిగూటి తిరుపతి,              :9573929493

Leave a Reply