‘‘ భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం, భారతదేశ రాష్ట్రపతి నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు. కేవలం దేశ రక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నపుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది. 2004లో దక్షిణ భారత దేశాన సునామి సంభవించి నపుడు కొద్ది గంటల్లోనే నేవి 27 నౌకలు, 19 హెలీకాప్టర్లు, 06 యుద్ధ విమానా నౌకలు, 5000 మంది సిబ్బందితో ముందుగా సహాయ చర్యలు చేపట్టింది. నేవి చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టడం ఇదే ప్రథమం.’’
నేడు భారత దేశ నౌకాదళ దినోత్సవం
భారతదేశములో నౌకాదళ దినో త్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 4 వ తేదీన జరుపు తారు. 1971 డిసెంబరు 4న భారత నేవీ, పాకి స్తాన్ అతిపెద్ద నౌకాశ్రయం అయిన కరాచి పోర్టుపై మెరుపు దాడి చేసి మూడు ఓడలను ముంచి వేసింది. రాత్రి సమయంలో భారత్ చేసిన ఈ దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అని అంటారు. దాని జ్ఞాపకార్ధం, భారత దేశంలో నౌకాదళ దినోత్సవం ను జరుపుకుంటారు. నౌకా దళాల విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసు కోవటానికి జరుపు కుంటారు.
భారత దేశంలో క్రి.పూ.2300లో ప్రస్తుత గుజరాత్ లోని మంగ్రోల్ దగ్గర మొట్టమొదటి నౌకాతీరం నిర్మించబడినది. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యంలో మొదటిసారి నౌకా విభాగాన్ని ఏర్పరిచారు. చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి అయిన చాణక్యుడు తాను రచించిన అర్థ శాస్త్రంలో నవాధ్యక్ష పేరుతో నదీ జలాల వినియోగం గురించి నిర్దేశించాడు. బ్రిటిషు ప్రభుత్వం భారత దేశాన్ని పాలిస్తున్నప్పుడు 1830లో రాయల్ ఇండియన్ నేవిని ఏర్పరిచారు. ఇది 1946 నాటికి 78 ఓడలు, 2000 మంది నిబ్బంది కలిగి ఉండేది. 26 జనవరి 1950 న భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిన రోజున నౌకా దళానికి ఇండియన్ నేవిగా, వాహకాలకు ఇండియన్ నావల్ షిప్ గా పేరు పెట్టారు.
1961లో జరిగిన ఆపరేషన్ విజయ్ లోఇండియన్ నేవి మొట్ట మొదటి సారి యుద్ధంలో పాల్గొన్నది. 1965లో జరిగిన భారత్ – పాక్ యుద్ధంలో నేవి ఎక్కువ పాల్గొనక పోయిన తీర ప్రాంతాల పరిరక్షణలో కీలకపాత్ర వహించింది. 1971లో జరిగిన భారత్ – పాక్ యుద్ధంలో నేవి విశిష్టమైన పాత్ర పోషించింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన పి ఎన్ ఎస్ ఘాజి జలాంతర్గామిని ద్వసం చేసి సముద్రంలో ముంచి వేసిన ఘనత ఐ ఎన్ ఎస్ – రాజ్ పుత్ కు దక్కుతుంది. ఐ ఎన్ ఎస్ నిర్ఘాట్, ఐ ఎన్ ఎస్ నిపత్ లు కరాచీ పోరను చుట్టిముట్టి మిగిలిన పాకిస్తాన్ పోర్టులతో రాకపోకలను, పాక్ సైన్యానికి సహాయాన్ని అడ్డుకొని భారత దేశానికి విజయాన్ని అందించడంలో ముఖ్యపాత్ర వహించాయి.
భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం, భారతదేశ రాష్ట్రపతి నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు. కేవలం దేశ రక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నపుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది. 2004లో దక్షిణ భారత దేశాన సునామి సంభవించి నపుడు కొద్ది గంటల్లోనే నేవి 27 నౌకలు, 19 హెలీకాప్టర్లు, 06 యుద్ధ విమానా నౌకలు, 5000 మంది సిబ్బందితో ముందుగా సహాయ చర్యలు చేపట్టింది. నేవి చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టడం ఇదే ప్రథమం.
భారత నావికాదళం దేశం యొక్క సముద్ర సరిహద్దులను భద్ర పరచుటలో, ఓడరేవు సందర్శనల ద్వారా, భారతదేశం అంతర్జాతీయ సంబంధాలను విస్తరించుటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉమ్మడి వ్యాయా మాలు, మానవతావాద మిషన్లు, విపత్తు ఉపశమనం మొదలైనవి వారి కర్తవ్యాలు. ఆధునిక భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని మెరుగు పరిచేందుకు వేగవంతమైన పునర్నిర్మాణంలో భాగంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం 58,000 మంది సిబ్బంది, విమాన వాహక నౌక, పెద్ద రవాణా ఓడ, 15 యుద్ధ నౌకలు, 8 గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, 24 కొర్వెట్టెలు, 13 సంప్రదాయ జలాంతర్గాములు, 1 అణు దాడి జలాంతర్గామి, 30 పెట్రోల్ ఓడలు, వివిధ సహాయక నౌకలు మొదలైనవి భారత నావికాదళంలో భాగం.భారత నావికా దళంలో తూర్పు కమాండ్ – విశాఖపట్నం, పశ్చిమ కమాండ్ – ముంబాయి దక్షిణ కమాండ్ – కోచి, అండమాన్ నికోబార్ నావల్ – పోర్ట్ బ్లెయిర్ అనే 4 కమాండ్ లు ఉన్నాయి.
1985 నుండి అణు జలాంత ర్గాములను నిర్మించడానికి కల్పాక్కం వద్ద ఉన్న అణు కేంద్రంతో కలసి నేవి కృషి చేస్తోంది.
1987లో భారత నౌకా దళంలో జలాంతర్గాముల విభాగాన్ని ఏర్పాటు చేశారు. జలాంత ర్గాముల నుండి టార్ఫీడో అను క్షిపణులను ప్రయోగిస్తారు.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్ట మొదటి సబ్ మెరైన్ – ఐ ఎన్ ఏస్ షల్కి. 8 డిసెంబర్ 1967లో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టబడిన తొలి జలాంతర్గామి – ఐ ఎన్ ఏస్ కల్వరి.
కల్వరిని భారత నౌకాదళంలో ప్రవేశ పెట్టబడిన రోజైన 08 డిసెంబర్ న జలాంతర్గామి దినంగా భారత నావికాదళం జరుపు కుంటుంది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494