Take a fresh look at your lifestyle.

ముష్కర మూకలను ఎదిరించిన వీరవనిత నేడు చాకలి ఐలమ్మ జయంతి

వరంగల్‌ ‌జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ 1895 సెప్టెంబర్‌ 26 ‌జన్మించారు. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. 1940-44 మధ్య కాలంలో విస్నూర్‌ ‌లో నిజాం నవాబు ఉస్మాన్‌ అలీఖాన్‌ అనుచరుడు విస్నూర్‌ ‌దేశ్‌ ‌ముఖ్‌ ‌రాపాక రాంచంద్రా రెడ్డి.. నిజాం ,రజాకార్‌ ‌మూకల అండదండలతో దేశ్‌ ‌ముఖ్‌ ‌సాగించిన అకృత్యాలు, ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. కడవెండి, విస్నూర్‌, ‌బైరాన్పల్లి కేంద్రాలుగా చుట్టు పక్కల గ్రామాలను తన ఆధిపత్యంలో ఉంచుకోని అక్రమాలకు, దౌర్జన్యాలను కొనసాగించాడు ప్రజల ధన,మాన ,ప్రాణాలతో చలగాటమాడటం అలవాటుగా మారింది. అటువంటి పరిస్థితిల్లో దేశ్‌ ‌ముఖ్‌ ‌గుండాలను,రజాకార్‌, ‌ముష్కర మూకలను ఎదిరించి,నిలిచిన వీరవనిత చాకలి ఐలమ్మ.ఆమే సాగించిన అనితర సాధ్యమైన పోరాటం ఈ ప్రాంత ప్రజలకు ధిక్కార స్వరాన్ని నేర్పింది.ఆప్రాంతంలో ఎదురులేకుండా పెత్తనం చలాయించిన దేశ్‌ ‌ముఖ్‌ ‌రాంచంద్రా రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది. మీసాలున్న మగాడే దోరా..నీ బాంచెన్‌ ..‌కాల్మోక్తా అంటూ వెట్టిచేసే రోజుల్లో ఓ సాధారణ గృహిణి దేశ్‌ ‌ముఖ్‌ అనుచరులను ఎదిరించి తన్నితరిమి తెలంగాణ వీరనారిగా నిలిచింది. ఐలమ్మ.భర్త, కుమారుల అండ లేకుండానే భూమిని దున్ని పంటను పండించిన అయిలమ్మ పంటను దోచుకునేందుకు ప్రయత్నించిన ముష్కరులను,విస్నూరు రాంచంద్రా రెడ్డి గుండాలను తన్ని తరిమిన తెలంగాణా వీరవనిత.సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెట్కర్య శాలి ఐలమ్మ.

దేశ్‌ ‌ముఖ్‌, ‌రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది.అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా అని ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు. దొరా అని పిలువకపోతే ఉన్నత కులాలతో పాటు వారి అనుంగు ఉంపుడు కత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకు వచ్చేది. వెనుకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి,దగ్గరుండి ఆఘాయిత్యం చేయించేవారు.ఈ భూమినాది… పండించిన పంటనాది..తీసుకెళ్లడానికి దొరెవ్వడు..నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెట్కతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ.మల్లంపల్లి భూస్వామి కొండలరావు 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. అందులో నాలుగు ఎకరాలు సాగుచేశారు. పాలకుర్తి పట్వారీ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు. పాలకుర్తి పట్వారీ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది.పాలకుర్తి పట్వారీ పప్పులుడకక ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విసునూర్‌ ‌దేశ్‌ ‌ముఖ్‌ ‌రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసులో అగ్రనాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయినప్పటికీ న్యాయస్థానంలో తీర్పు దేశ్‌ ‌ముఖ్‌ ‌వ్యతిరేకంగా వచ్చింది. బహుజనుల విజయంగా సంబురాలు చేసుకున్నారు.

ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్‌ ‌ముఖ్‌ ‌పట్వారిని పిలిపించుకొని, అయిలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు. భూమి తనదని, వండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వందమందిని దేశ్‌ ‌ముఖ్‌ ‌పంపాడు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోసారు.కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది.రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్‌ ‌ముఖ్‌ ‌రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టారు. ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు.ఐలమ్మ కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఐలమ్మ కుమారులు ముగ్గురు పాలకుర్తి పట్వారీ ఇంటిని కూల్చి అదే స్ధలంలో మొక్కజొన్న పంటను పండించారు.అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం ఎరజ్రెండాను వీడలేదు.‘ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏవిధంగా నష్టపెట్టగలడు, అని తనలో తాను ప్రశ్నించుకొన్నది. నీ దొరోడు ఏం చేస్తాడ్రా’ అని మొక్కవోని ధెట్కర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరమి కొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. అయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు.అయిలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు.10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్‌ 10, 1985 ‌న అనారోగ్యంతో మరణించింది. పాలకుర్తిలో ఐలమ్మ స్మారకార్థం,స్మారక భవనాన్ని నిర్మించారు.

తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి వెట్టి చాకిరి నుండి విముక్తి చెందారు. బాంఛెన్‌ ‌దొర అన్న బహుజనలు బందూకు పట్టి ఆ దోరలను తరిమికొట్టి దొర ఘడీలను స్వాదీనం చేసుకున్నారు. దున్నే వారిదే భూమి అని భూపోరాటాలు చేసి దొరలు భూస్వాముల నుండి భూములు గుంజుకొని తెలంగాణ ధిక్కారాన్ని ప్రదర్శించి, తెలంగాణ బహుజన ప్రజలు తెగువ చూపారు.అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన తెలంగాణలో బహుజన నాయకులు బాడుగ నేతలుగా, బానిసత్వంలో జీవిస్తూ నీ బాంఛన్‌ ‌దొర అంటూ నేడు గతం కన్నా ఎక్కువ కనీస స్వాభిమానం లేకుండా జీవిస్తున్నారు.తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత,సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ, ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రం సాధించిన తెలంగాణ ప్రధాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించడం ముధావహం.

– డా. సంగని మల్లేశ్వర్‌,‌రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు
ఫూలే ఆశయ సాధన సమితి (పాస్‌)
‌సెల్‌ -986625535

Leave a Reply