నేడు అబ్దుల్ కలాం ‘‘జయంతి’’.. ఆయన స్మృతి పథంలో…
ఆయన…
ఓ మహర్షి
ఓ మహా మనీషి
ఆ ‘‘అస్తిత్వం’’ మానవీయం
ఆ ‘‘వ్యక్తిత్వం’’ ఆదర్శప్రాయం
ఆయన…
ఓ శాస్త్రవేత్త
ఓ సాహితీవేత్త
ఆ ‘‘మేథ•’’ అద్భుతాల తోట
ఆ ‘‘చేత ‘‘ ఆవిష్కరణల బాట
ఆయన…
ఓ శ్రామికుడు
ఓ స్వాప్నినికుడు
ఆ హాసం ‘‘శాంతి’’ చార
ఆ వీక్షణం ‘‘క్రాంతి’’ ధార
ఆయన…
ఓ నిత్య విద్యార్థి
ఓ సత్య శోధితుడు
ఆ ‘‘పలుకు’’ ప్రణవ నాదం
ఆ ‘‘ప్రవచనం’’ ప్రమోద గీతం
కలలు కనండి…
సాకారం చేసుకొండంటూ
యువతకు ‘‘ప్రేరణ’’ నిచ్చిన
నిలువెత్తు నిబ్బర ‘‘శిఖరం’’
దేశ అణ్వస్త్ర అమ్ములపొదిలో
పొదిగిన మహా ‘‘మిస్సైల్’’ మ్యాన్
దేశ ‘‘ప్రథమ’’ పౌరునిగా
పదవికి వన్నెలద్దిన ‘‘వెన్నెల’’ రేడు
జీవితం తుది శ్వాస దాకా
జాతి ఉన్నతికి శ్రమించిన క్రియాశీలిడు
ఓ విశ్వ ప్రజ్వలితుడా..!
ఓ అద్భుత అబ్దుల్ కలాం
నిను తలచి ‘‘పుడమి’’ పులకిస్తోంది
భరత ‘‘జాతి’’ తరచి పరవశిస్తోంది
త్రివర్ణ పతాక గర్వంగా ఎగురుతోంది
ప్రపంచం శిరస్సు వంచి ప్రణమిల్లుతోంది
– కోడిగూటి తిరుపతి, 9573929493