Take a fresh look at your lifestyle.

ఈ ‌రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు : రాజాసింగ్‌

‌ప్రజాస్వామ్యానికి ఇవాళ చీకటి రోజని బీజేపీఎల్పీ నేత రాజాసింగ్‌ అన్నారు. తాము అంబేద్కర్‌ ‌రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఉంటే అసెంబ్లీలో ఉంటే స్పీకర్‌ ‌తమ హక్కులను కాలరాసారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ‌రాజకీయ కుట్రలో భాగంగానే తమను సస్పెండ్‌ ‌చేశారని ఆరోపించారు.

గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపే అవకాశాన్ని కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.తమ హక్కులను కాలరాసే హక్కు సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గౌరస సభ్యులమని కూడా చూడకండా అసెంబ్లీ ఆవరణ నుంచి పోలీసులు తమను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.

Leave a Reply