Take a fresh look at your lifestyle.

నియంత్రిత పంటలపై నేడు కీలక సమావేశం

  • అధికారులు, కలెక్టర్లతో చర్చించనున్న సిఎం కెసిఆర్‌
  • ‌జిల్లాల వారీగా పంటల ప్రణాళికను వెల్లడించే అవకాశం

పంటలసాగు విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 21న గురువారం ప్రగతిభవన్‌లో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, అధికారులు, రైతు సంఘాల నేతలు హాజరుకానున్నారు. జిల్లాల వారీగా పంటల సాగుపై సమావేశంలో చర్చ జరుగనుంది. వరిసాగు ఏ రకం, ఎక్కడెక్కడ వేయాలనే అంశంపై చర్చించను న్నారు. సమావేశం తర్వాత జిల్లాల వారీగా పంటల మ్యాప్‌ను అధికారులు రూపొందించనున్నారు. కేసీఆర్‌ ఆమోదంతో పంటలు సాగు విధానంపై ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులతో పలుమార్లు చర్చించిన సిఎం కెసిఆర్‌ ‌నియంత్రిత పంటల విధానాన్ని ప్రకటించారు. దీంతో జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏ పంటలు వేయాలో ఓ నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికి  నియంత్రిత పంటల సాగు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించించింది. ఏ జిల్లాలో ఏ పంట ఎంత మొత్తం విస్తీర్ణంలో సాగుకావాలనే దానిపై ప్రభుత్వం పంట ప్రణాళికను జిల్లా వ్యవసాయ కార్డుల రూపంలో అందిస్తుంది. దీనిని కలెక్టర్లు వారి సంబంధిత జిల్లాల్లో అమలు చేయాల్సి ఉంటుంది. ఈ వానకాలం సాగులో ప్రభుత్వం చెప్పిన ప్రకారం కాకుండా వేరే ఇష్టారీతిన సాగు చేస్తే రైతుబంధును కట్‌ ‌చేయనున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా పంటల మ్యాపింగ్‌ను వ్యవసాయ శాఖ పూర్తి చేసింది.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సోమవారం దీనిని ప్రతిపాదించగా ఓకే చెప్పినట్లు కూడా తెలిసింది. దీనిపై మరోమారు కలెక్టర్లు, ఇతర అధికారులతో సిఎం గురువారం మరింత లోతుగా చర్చించనున్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రధానంగా పత్తి, కంది, వరి పంటల సాగును ప్రోత్సాహించనున్నారు. మెదక్‌, ‌నారాయణ్‌పేట్‌, ‌యదాద్రి భువనగిరి జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పత్తి సాగును పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రధానంగా మూడు జిల్లాల్లో అత్యధికంగా పత్తి పంటను సాగు చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈసారి ప్రభుత్వం కంది పప్పు సాగును విపరీతంగా ప్రోత్సాహించాలని పంటల మ్యాపింగ్‌లో నిర్ణయించింది. ఎంత కంది వస్తే అంత మొత్తం మద్ధతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కూడా సిఎం కెసిఆర్‌ ‌సోమవారం డియా సమావేశంలో ప్రకటించారు. గత ఏడాది వానకాలం సాగుతో పోలిస్తే దాదాపు అన్ని జిల్లాల్లో కంది పంట సాగును పెంచనున్నారు. మొత్తంగా జిల్లాల వారిగా పంటల సాగు వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు.

Leave a Reply