Take a fresh look at your lifestyle.

నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం..మే డే

కొత్త ఒరవడితో కార్మిక ఉద్యమాలు నిర్మించాలి

nerupati aanandhకార్మికులు, ఉద్యోగుల శ్రమ దోపిడికి నిరసనగా పోరాడి విజయం సాధించిన రోజు మే 1. అందుకే ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల దినోత్సవంగా జరుపుతారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కార్మికులకు నిర్దేశిత పని గంటలు వుండేవికావు. వాళ్ళు రోజుకి 16 నుండి 18 గంటలు పనిచేయాల్సి వచ్చేది. వారికి లభించే జీతాలు అంతంత మాత్రంగానే వుండేవి. దీనితో అమెరికాలోని చికాగో పట్టణంలో 1884లో కార్మికులు రోజుకి 8 గంటలు మాత్రమే పని వుండాలని ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళన 1886 నాటికి తారాస్థాయికి చేరింది. మే 1, 1886న 40 వేల మంది కార్మికులు సమ్మె మొదలు పెడితే 3 మే నాటికి శ్రామికుల సంఖ్య లక్ష మందికి చేరుకుంది. సమ్మె ఉధృతమయ్యేసరికి పారిశ్రామిక సంస్థల యూజమానులు పోలీసు సాయం కోరగా పోలీసులు కాల్పులు జరిపారు. ఇద్దరు కార్మికులు మరణించారు. పారిశ్రామిక సంస్థ ముందు పెద్ద ప్రదర్శన జరిగింది. శాంతియుతంగా జరుగుతున్న ఈ ప్రదర్శన మీద పోలీసులు హే మార్కెట్‌ ‌వద్ద 4 మే రోజున తిరిగి జరిగిన కాల్పులో 8 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. తర్వాతి రోజుల్లో గాయపడిన వారిలో మరో ఏడుగురు చనిపోయారు. శాంతియుతంగా జరుగుతున్న పోరాటానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి. 1890, మే 1న బ్రిటన్‌లోని హైడ్‌ ‌పార్క్‌లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్‌. ఆ ‌పైన అనేక యూరొపియన్‌ ‌దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. ఆపై ప్రపంచవ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం పరిపాటైంది.1900 నుంచి 1920 వరకూ యూరప్‌లో ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే1న నిరసన ప్రదర్శనలు జరిగేవి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మే డే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు.

భారతదేశంలో కార్మిక రంగం నేడు తీవ్ర రాజకీయ, సైద్ధాంతిక బలహీనతలను ఎదుర్కొంటున్నది. మనదేశంలో అధిక శాతం దాదాపు 92% కార్మికులు అసంఘటిత రంగాలలో పనిచేస్తూ తక్కువ వేతనాలతో, సాంఘిక భద్రత లేకుండా ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. సమాజంలో మిగిలిన పీడిత ప్రజా రాశులకు ముందుండి రాజకీయంగా ఆదర్శంగా ఉండాల్సిన కార్మికవర్గం వెనకబడి పోయింది. 1920లో కార్మిక ఉద్యమం ప్రారంభమైంది ఇందులో 27 సంవత్సరాలు భారత స్వాతంత్రోద్యమం లోనే అంతర్భాగంగా సాగింది. కొన్ని సైద్ధాంతిక రాజకీయ బలహీనతలు ఉన్నప్పటికిని 1947 వరకు స్థూలంగా దేశ స్వాతంత్య్ర సాధన అనే ఒక నిర్దిష్ట రాజకీయ కార్మిక ఉద్యమం ముందుకు సాగింది. భారతదేశం మే 1ని 1923లో మొదటిసారిగా లేబర్‌ ‌కిసాన్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో మద్రాసు (ఇప్పడు చెన్నై) లో జరుపుకొంది. స్త్రీ, పురుష . కార్మికుల గౌరవార్థం ఈ రోజు కార్మికులు ఎర్రని జెండాలు ఎగురవేస్తారు. మేడేకు కారణభూతమైన చికాగో కాల్పుల్లో మరణించిన కార్మిక మృతవీరుల రక్తపు రంగుకు సంకేతంగా ఎర్ర జెండా ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా 80 దేశల్లో ఈ ఉత్సవం అధీకృతంగా జరుగుతుంది. భారతదేశంలో శ్రామికులకు రోజుకు 8 పని గంటలు ప్రవేశపెట్టడానికి, స్త్రీ పురుషులకు ఒక పనికి సమాన వేతనం ఇవ్వడానికి డా. బి.అర్‌. అం‌బేద్కర్‌ ‌మూల కారణం. ఆర్థిక కోర్కెల సాధనకై జరిగే కార్మిక ఉద్యమాలకు రాజకీయ గమ్యం వైపు ప్రయాణం చేయలేని నడక, ఎంత దూరం సాగినా రాజకీయ ఫలితం ఉండదు. అదే విధంగా హక్కుల గమ్యాన్ని రూపొందించుకోకుండా ఎంత దూరం నడచినా ఫలితం ఉండదు. భారత కార్మిక ఉద్యమం గతం నుంచి చారిత్రకంగా రాజకీయంగా తగిన గుణపాఠం తీసుకోవాలి. గత లోపాల నుండి బయటపడి కొత్త ఒరవడితో కార్మిక ఉద్యమాలను నిర్మించాల్సి ఉంది. దానికొరకు నిరంతరం ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం.

Leave a Reply