Take a fresh look at your lifestyle.

సిద్ధిపేటకు ‘గోల్డెన్‌ ‌డే’ వాళ్ల సంతోషం చూస్తే నా జీవితం ధన్యమైంది : మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేటకు నేడు(గురువారం) గోల్డెన్‌ ‌డే అని…కేసీఆర్‌ ‌నగర్‌లో సామూహిక గృహ ప్రవేశం చేసిన లబ్దిదారుల ముఖాల్లో సంతోషం చూస్తుంటే నా జీవితం ధన్యమైందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతూ…నాకు ఇప్పటి వరకు సొంతిల్లు కట్టుకునే అదృష్టం రాలేదనీ, కానీ నర్సాపూర్‌ ‌వద్ద నిర్మించిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల వద్దకు కనీసం 400సార్లు వెళ్లొచ్చాననీ, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని గేటెడ్‌ ‌కమ్యూటినీలో లేని గ్యాస్‌ ‌పైప్‌ ‌కనెక్షన్‌ ‌కూడా ఇక్కడ ఇచ్చామనీ, చెప్పుకుంటూ పోతే ఎన్నో సౌకరర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.

డబుల్‌ ‌బెడ్‌రూం పథకం.. సీఎం కేసీఆర్‌ ‌కల అని, ఇది ఎవరో అడిగింది కాదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గతంలో పాలకులు నిర్మించిన ఇండ్లు మురికి కూపాలు, స్లమ్‌లుగా ఉండేవని, పేదలంటే వారికి చిన్నచూపని అన్నారు. కానీ నేడు టీఆర్‌ఎస్‌ ‌సర్కారు నిరుపేదలకు సకల సదుపాయాలతో కాళ్లకు మట్టి అంటకుండా ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని చెప్పారు. గేటెడ్‌ ‌కమ్యూనిటీలను తలదన్నేలా డబుల్‌బెడ్‌రూంలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఇంటి నిర్మాణాలను తాను  400 సార్లు పరిశీలించానని, నాణ్యతతో కట్టేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రెండున్నరేళ్ల కృషి వల్ల నేడు గృహప్రవేశాలు చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ పథకంతో తన జన్మధన్యమైందన్నారు. అయితే, తమ పట్టణంలో ఇంకా కొంతమంది ఇండ్లు రానివారు ఉన్నారని, సిఎం కేసీఆర్‌ ‌పెద్ద మనసు చేసుకొని మరో వెయ్యి డబుల్‌ ‌బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేయానీ,  బస్తీ దవాఖానను కూడా మంజూరుచేయాలనీ,  త్రీ టౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ను మంజూరు చేయాలని కోరారు. అలాగే, సిద్దిపేట నుంచి చిన్నకోడూరు వరకు ఫోర్‌ ‌లైన్‌ ‌రోడ్‌ను ఏర్పాటు చేయాలనీ, కోమటిచెరువుకు సైకిల్‌ ‌ట్రాక్‌, ‌నెక్లెస్‌ ‌రోడ్‌, ‌వాకింగ్‌ ‌ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరారు. సిఎం కేసీఆర్‌ ‌స్వచ్ఛ సిద్దిపేట గురించి ఆనాడే కలగన్నారని, అది ఇప్పుడు నెరవేరిందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

Leave a Reply