Take a fresh look at your lifestyle.

అందరివాడు అంబేడ్కర్‌…

నేడు  డా।। అంబేద్కర్‌ ‌వర్ధంతి..

కుల మతాలలోని కుళ్ళు ఎండగట్టారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మనువాదాన్ని తగలబెట్టాలని చాటి మనువాదం నుంచి విముక్తి పొందడమే మార్గమని చెప్పి ఆ దిశగా నడిపించిన వ్యక్తి అంబేడ్కర్‌. ‌సమసమాజ స్థాపకుడు భారత సమాజానికి పరిచయం అక్కరలేని మహోన్నత వ్యక్తి సమాజం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఉత్తముడు. నవ బుద్ధుడు, నవభారత దర్శకుడు, విద్యావేత్త,మేధావి రాజీపడని పోరాటయోధుడు, రాజ్యాంగ పిత అందరి బంధువు, అన్ని వర్గాల ప్రజలు అభిమానించి గౌరవించే వ్యక్తులలో డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ఒకరు. సామాజిక తరగతుల అభివృద్ధికై ఆయన చేసిన మొదటి పోరాటం కులం మతం పైన. భారత సమాజంలో కులం పునాదులు ఎంత బలంగా ఉన్నాయో గుర్తించి, కులం మతం సంబంధాలు, సమాజాభివృద్ధిపై వాటి పాత్ర ఆయన తెలుసుకున్నారు. పాఠాలు నేర్చుకుని అనుభవాలను విశ్లేషించి చెప్పారు. కుల మతాలలోని కుళ్ళు ఎండగట్టారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మనువాదాన్ని తగలబెట్టాలని చాటి మనువాదం నుంచి విముక్తి పొందడమే మార్గమని చెప్పి ఆ దిశగా నడిపించిన వ్యక్తి అంబేడ్కర్‌. ‌సమసమాజ స్థాపకుడు భారత సమాజానికి పరిచయం అక్కరలేని మహోన్నత వ్యక్తి సమాజం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఉత్తముడు.

1891 సంవత్సరం ఏప్రిల్‌ 14‌న భీమాబాయి, రాంజీ సక్‌ ‌పాల్‌ ‌దంపతులకు జన్మించిన ఆయన మొదటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా చదువుపై మక్కువను ఆయన చంపుకోలేదు. పాఠశాలలో ఇతర కులాలకు చిన్న పిల్లలకు దూరంగా ఓ గోనెపట్టా వేసుకొని కూర్చుని పాఠాలను విన్నారు. అంటరానితనం ఎలా ఉంటుందో చిన్ననాడే అనుభవించారు. చిరుప్రాయంలోనే అవమానాలను చీదరింపులు ఎలా ఉంటాయో ఆ హృదయానికి అర్థమైంది.ఆయనలో చదువుకోవాలనే తపన గుర్తించిన ఓ బ్రాహ్మణుడు అన్నం పెట్టి ఆదరించి, విజ్ఞానం అందించాడు. గురువు పేరును తన పేరులో మొదటగా చేర్చుకుని గురువుని గౌరవించాడు అంబేడ్కర్‌.

‌ప్రపంచంలో ఎక్కడా దొరకని పుస్తకాలను చదివిన వారిలో కారల్‌ ‌మార్కస్ ‌మొదటి వ్యక్తి కాగా రెండో వ్యక్తి డాక్టర్‌ అం‌బేడ్కర్‌. ‌కొలంబియా లండన్‌ ‌విశ్వవిద్యాలయాల నుంచి పిహెచ్‌ ‌డి, డీఎస్సీ, పట్టా అందుకున్నారు. అంబేద్కర్‌ ‌నిరంతర అధ్యయన శీలి. అందుకే తొలుత అభిప్రాయాలను తర్వాత కాలంలో మార్చుకున్నారు. బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాలను బలపరుస్తూ పోరాటయోధుల కేసులను వాదించారు. దళితుల్ని చైతన్యం చేయటం కోసం 1924 సంవత్సరంలో దళిత విముక్తి సంఘం ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర మహర్‌ ‌చౌదరి చెరువులో నీళ్ళుతగే హక్కులేని దళితుల్ని చైతన్యపరిచి వేలాది మందితో ఊరేగింపుగా వెళ్లి చెరువు నీళ్లను తాగారు. ఈ సంఘటన ఆ రోజుల్లో సంచలనాన్ని సృష్టించింది. అంబేడ్కర్‌ ఆధిపత్య వర్గాల అగ్రహారానికి గురయ్యారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు మహాత్మ జ్యోతిరావు పూలేను గురువుగా చెప్పుకున్నారు. .

1927 డిసెంబర్‌ 25‌న అంబేద్కర్‌ ‌మనుస్మృతి ని దహనం చేయడం పెద్ద దుమారం రేపింది. అంబేద్కర్‌ ‌సంపాదకత్వంలో ముక్‌ ‌నాయక్‌ ‌పక్షపత్రిక నడిచింది. 1927 సంవత్సరంలో బహిష్కృత భారతి మరాఠీ పక్ష పత్రిక ప్రారంభించారు. 1936 లో ఇండిపెండెంట్‌ ‌లేబర్‌ ‌పార్టీ నెలకొల్పారు. బొంబాయ్‌ ‌నియోజకవర్గంలో డాంగే కమ్యూనిస్టు నాయకులతో కలిసి ఎన్నికలలో పాల్గొని బొంబై కౌన్సిల్‌ ‌లో ప్రజాసమస్యల పరిష్కారం కోసం గళాన్ని వినిపించారు. కార్మిక కర్షక సమస్యలను సభలొ లేవనెత్తి చర్చించేవారు. కులవ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు కృషి చేసారు.

రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, కులాంతర వివాహం, సహపంక్తి భోజనాలు, భూముల జాతీయ లాంటి తదితర అంశాలపై గళం విప్పారు. ఎర్రవాడ జైలులో గాంధీ నిరాహార దీక్ష ప్రారంభించి నప్పుడు మహాత్ములు వస్తుంటారు పోతుంటారు, అంటరానివారు మాత్రం అంటరాని వారు గానే మిగిలి పోతున్నారు…. అని చాటిన వ్యక్తి అంబేడ్కర్‌. ‌దళిత హక్కుల కోసం సామాజిక హోదా కోసం పోరాటాలు చేసారు. స్వాతంత్రం అనంతరం ఏర్పడిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ రచన కమిటీకి అంబేద్కర్‌ ‌చైర్మన్‌ ‌గా ఉన్నారు. రాజ్యాంగ రచనలో సింహభాగం అంబేద్కర్‌ ‌కృషే. రాజ్యాంగ అమలుపై ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.

1951 ఫిబ్రవరి 5న ఆయన ప్రవేశపెట్టిన హిందూ కోడ్‌ ‌బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందక పోవడంతో అంబేడ్కర్‌ ఆవేదన చెందారు. బిల్లు ఆమోదం లభించనందుకు నిరసనగా న్యాయశాఖ మంత్రి పదవిని రాజీనామా చేశారు. ఆయన స్త్రీ పక్షపాతి. హిందువుగా పుట్టడం నా చేతుల్లో లేకపోయినా హిందువుగా మాత్రం చనిపోనని చెప్పి 1956 అక్టోబర్‌ 14‌న నాగపూర్‌ ‌లో బౌద్ధ మతం స్వీకరించి రెండు నెలలు గడవకముందే 1956 డిసెంబర్‌ 6‌న ఆ మహానుభావుడు మానవాళికి భౌతికంగా దూరం అయ్యారు. ‘‘ ది ప్రాబ్లం ఆఫ్‌ ‌ది రూపీ, ది బుద్ధ అండ్‌ ‌హిజ్‌ ‌ధర్మ, కుల నిర్మూలన, శూద్రులు అంటే ఎవరు, అస్పృశ్యులు అంటే ఎవరు, బుద్ధుడు ధర్మం, లాంటి ముఖ్య రచనలు చేసారు. భారత ప్రభుత్వం 1991 సంవత్సరంలో భారతరత్నను ప్రకటించి గౌరవించింది. నేటి తరం లో ఉన్న యువత అంబేద్కర్‌ ‌ను ఆదర్శంగా తీసుకొని ఆయన సిద్ధాంతాలు అనుసరిస్తూ ముందుకు నడవడమే లక్ష్యం చేసుకోవాలి.
– నరేష్‌ ‌జాటోత్‌. ఎం.ఏ . (‌కాకతీయ విశ్వవిద్యాలయం).బీఈడీ. ( ప్రభుత్వ
ఉపాధ్యాయ కళాశాల నల్లగొండ).(8247887267)

Leave a Reply