Take a fresh look at your lifestyle.

నేడు దేశవ్యాప్తంగా కొరోనా వ్యాక్సిన్‌ ‌డ్రైరన్‌

  • రాష్ట్రాలలో ఏర్పాట్లపై చర్చించిన కేంద్ర మంత్రి డా.హర్షవర్ధన్‌
  • ‌వెంటనే రవాణా ప్రారంభిస్తామని వెల్లడి
  • సాఫ్ట్‌వేర్‌ ‌సమస్యలు పరిష్కరించాలని మంత్రి ఈటల విజ్ఞప్తి

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌కొరోనా వైరస్‌ ‌నివారణకు తీసుకోవాల్సిన చర్యలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ ‌డ్రైరన్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో ఎంపిక చేసిన జిల్లాలలో ప్రయోగాత్మకంగా డ్రైరన్‌ను నిర్వహించారు. దేశవ్యాప్తంగా కొరోనా వ్యాక్సిన్‌ ఈనెల 13 నుంచి ప్రారంభం అవుతుందని కేంద్రం నుంచి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో గురువారం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్‌ ‌సహాయ మంత్రి అశ్విన్‌ ‌కుమార్‌ అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సమావేశంలో డ్రైరన్‌ ‌నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. సాఫ్ట్‌వేర్‌ ‌పనిచేస్తున్న తీరు, వ్యాక్సిన్‌ను నిల్వ చేయడానికి అవసరమైన కోల్డ్ ‌స్టోరేజ్‌, ‌రవాణా చేయడానికి అవసరమైన కోల్డ్ ‌చైన్‌, ‌బెనిఫిషియరీ ఎన్‌రోల్‌మెంట్‌పై సుదీర్ఘంగా చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రుల అభిప్రాయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌ ‌సమస్యలు ఉన్నట్లుగా రాష్ట్ర వైద్య,, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ‌కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 14 జిల్లాలలో వ్యాక్సిన్‌ ‌లబ్దిదారులను నమోదు చేయడానికి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. మంత్రి ఈటల తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై స్పందించిన కేంద్ర మంత్రి వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనే వ్యాక్సిన్‌ ‌తయారవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఎక్కువ డోసులు అందజేయాలని ఈటల కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం హెల్త్‌కేర్‌ ‌వర్కర్లకు మాత్రమే కొరోనా వ్యాక్సిన్‌ ఇస్తున్నామనీ, కొరోనా వ్యాప్తిని అరికట్టడానికి చికిత్స అందించడానికి ముందు వరుసలో ఉండి పనిచేసిన పారిశుధ్య, కార్మికులు, మున్సిపల్‌ ‌వర్కర్లు, పోలీసులు కూడా అతి త్వరగా వ్యాక్సిన్‌ అం‌దేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 50 ఏళ్లు పైబడిన వారందరకీ అతి త్వరలో వ్యాక్సిన్‌ అం‌దజేయాలని కోరారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటలతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, డీహెచ్‌ శ్రీ‌నివాసరావు, కొరోనా నిపుణుల కమిటీ సభ్యుడు డా.గంగాధర్‌, ‌డబ్ల్యుహెచ్‌వో ప్రతినిధి పుట్ట రాజు, యుఎన్‌ ‌డెవల్‌పమెంట్‌ ‌పోగ్రాం ప్రతినిధి మనీష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచే రవాణా ప్రారంభిస్తాం : కేంద్ర మంత్రి డా.హర్షవర్ధన్‌
‌దేశంలోని అన్ని రాష్ట్రాలకు శుక్రవారం నుంచి కోవిడ్‌ ‌టీకాల రవాణాను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి డా.హర్షవర్ధన్‌ ‌వెల్లడించారు. మహారాష్ట్ర, కేరళ, చత్తిస్‌గఢ్‌ ‌రాష్ట్రాలలో కేసులు అనూహ్యంగా పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవాగ్జిన్‌, ‌కొవిషీల్డ్ ‌టీకాలు అందుబాటులోకి వస్తున్నాయనీ, దేశంలో ప్రతీ వొక్కరికీ టీకా అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. టీకాలపై అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మలేదనీ, ప్రాథామ్య వర్గాలకు ముందుగా టీకా ఇవ్వాలని డీసీజీఐ కమిటీ సూచించిందని వెల్లడించారు. పూణే కేంద్రంగా దేశవ్యాప్తంగా కోవిడ్‌ ‌టీకాలను సరఫరా చేస్తామనీ, దీని కోసం దేశవ్యాప్తంగా 41 స్టోరేజి కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా డా.హర్షవర్ధన్‌ ‌తెలిపారు.

Leave a Reply