Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా కొరోనా రికవరీ రేటు.. 78.28 శాతం

24 గంటల్లో 83,809 మందికి పాజిటివ్‌

దేశవ్యాప్తంగా కొరోనా వైరస్‌ ‌విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ ‌స్థాయిలో 83,809 పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 49,30,237కు చేరింది. తాజాగా వైరస్‌ ‌బారిపడి 1054 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 80,776కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 79,292 డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారిసంఖ్య 38,59,400గా నమోదైంది. దేశంలో 78.28 శాతం కొరోనా రోగుల రికవరీ రేటు ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ ‌బులిటెన్‌లో పేర్కొంది. యాక్టివ్‌ ‌కేసుల శాతం 20.08 శాతం ఉండగా… దేశ వ్యాప్తంగా యాక్టీవ్‌ ‌కేసులు 9,90,061 ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.64 శాతానికి తగ్గింది. ఇక గడచిన 24 గంటలలో దేశంలో 10,72,845 కొరోనా వైరస్‌ ‌నిర్దారణ పరీక్షల నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా వైరస్‌ ‌నిర్దారణ పరీక్షల సంఖ్య 5,83,12,273గా నమోదైనట్లు కేంద్రవైద్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

లాక్‌డౌన్‌తో 78వేల మరణాలు నిరోధించామని రాజ్యసభలో మంత్రి హర్షవర్దన్‌ ‌వెల్లడి
దేశంలో లాక్‌డౌన్‌ ‌విధించడం వల్ల సుమారు 14 నుంచి 29 లక్షల కొరోనా కేసులు, 37 వేల నుంచి 78 వేల మరణాలను నిరోధించగలిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్‌ ‌తెలిపారు. రాజ్యసభలో మంగళవారం కొరోనా గురించి ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ ‌విధించిన నాలుగు నెలల కాలాన్ని ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు పెంచుకునేందుకు, అత్యవసర మైన పీపీఈ కిట్లు, ఎన్‌95 ‌మాస్కులు, వెంటిలేటర్లను దేశంలో ఉత్పత్తి చేసేందుకు వినియోగించుకున్నట్లు చెప్పారు.

కొరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం మరణాల రేటు 1.67 శాతం, కోలుకున్నవారి శాతం 77.65గా ఉన్నదని తెలిపారు. కొరోనా కేసులు, మరణాలను భారత్‌ ‌గణనీయంగా తగ్గించగలిగిందని అన్నారు. ప్రతి పది లక్షల మంది జనాభాలో 3,320 మంది వైరస్‌ ‌బారిన పడగా 55 మంది మాత్రమే మరణించారని చెప్పారు. ప్రపంచ దేశాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువని రాజ్యసభకు మంత్రి హర్ష వర్ధన్‌ ‌వివరించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!