Take a fresh look at your lifestyle.

దేశంలో కొరోనా ‘కాటు’

  • 308కు చేరిన మరణాలు
  • 24గంటల్లో 35మంది కొరోనా మృతులు
  • మొత్తంగా 9,152 పాజిటివ్‌ ‌కేసులు
  •  2 లక్షల మందికి పరీక్షలు
  • మరో ఆరువారాలకు సరిపడా టెస్టింగ్‌ ‌కిట్లు సిద్దం
  • ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ 

దేశంలో కొరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 796 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని, 35 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 9,152కి చేరిందని, మరణాల సంఖ్య కూడా 308కి చేరిందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ‌తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 లక్షల మందికి కొరోనా
పరీక్షలు నిర్వహించామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)‌కి చెందిన అధికారి రమణ్‌ ఆర్‌ ‌గంగా ఖేద్కర్‌ ‌వెల్లడించారు. టెస్టింగ్‌ ‌కిట్ల విషయంలో సరిపడా స్టాక్‌ ఉం‌దని, ప్రస్తుతం మరో ఆరు వారాలకు సరిపడా కిట్లు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని ఖేద్కర్‌ ‌తెలిపారు. చైనా నుంచి తొలివిడతగా బయలుదేరిన టెస్టింగ్‌ ‌కిట్లు ఈ నెల 15 కల్లా చేరుకుంటాయని చెప్పారు.

ప్రస్తుతం దేశంలో 8,048 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 980 మంది కోలుకొని డిశ్చార్జ్ ‌కాగా 324 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో మరో 51 మంది మరణించగా.. కొత్తగా 905 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే తమిళనాడులో కొత్తగా 98 కరోనా కేసులు నమోదు కాగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,173కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 మంది చనిపోయారు. మరోవైపు కేరళలో సోమవారం కేవలం 3 కేసులు మాత్రమే నమోదు కావడంతో మొత్తం కోవిడ్‌-19 ‌కేసుల సంఖ్య 378కి చేరింది. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా రాష్టాల్రమధ్య లారీల రవాణాకు అనుమతిస్తున్నట్టు కేంద్ర •ంమంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అత్యవసర విభాగాల వారికి పాసులు జారీ చేశాం. మహమ్మారిని తరిమికొట్టాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి.  కరోనా సంక్షోభం నుంచి బయటపడాలంటే సామాజిక దూరం తప్పకుండా పాటించాలి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఎప్పటికప్పుడు రాష్టాల్రతో సంప్రదింపులు జరుపుతున్నామని’ కేంద్రం వెల్లడించింది.   రెండు లక్షలకు పైగా కరోనా-19 పరీక్షలు నిర్వహించామని, మరో ఆరు వారాల పాటు పరీక్షలు నిర్వహించేందుకు తగిన స్టాక్‌ ‌తమ వద్ద ఉందని కూడా  కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ‌పేర్కొన్నారు.

పంజాబ్‌లో కొత్తగా 16 పాజిటివ్‌ ‌కేసులు
పంజాబ్‌లో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర •ం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి పంజాబ్‌లో మొత్తం నమోదైన కరోనా నిర్దారిత కేసుల సంఖ్య 167కు పెరిగింది. అలాగే, ఇప్పటి వరకు 14 మంది కోలుకోగా, 11 మంది మృతి చెందారు. ఎస్‌ఏఎస్‌ ‌నగర్‌ ‌జిల్లాలో అత్యధికంగా 38 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులతో పోలిస్తే పంజాబ్‌ 14‌వ స్థానంలో ఉంది. 1985 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ (1176), తమిళనాడు (1075) ఉన్నాయి.

Leave a Reply