Take a fresh look at your lifestyle.

దేశంలో పెరుగుతూ, తెలంగాణలో తగ్గుతున్న కొరోనా..!

  • ఆందోళన కలిగిస్తున్న థర్డ్ ‌వేవ్‌ ..
  • ఆం‌దోళనలో తల్లితండ్రులు

దేశంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతుండగా. తెలంగాణలో మాత్రం తగ్గుముఖం చూపిస్తున్నది. అయినా నిర్భయంగా ఉండే పరిస్థితి మాత్రం కనిపించడంలేదు. నిత్యం వేల సంఖ్యలో నమోదు అవుతూ వచ్చిన కేసులు ఇప్పుడు మూడు నాలుగు వందలకు మించి నమోదు కావడంలేదు. ఇందులో అధికంగా జిహెచ్‌ఎం‌సి పరిధిలోనే నమోదవుతున్నాయి. వినాయక చవితికి ఒక రోజు ముందు ఇక్కడ సుమారు 70 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడం గమనార్హం. కరీంనగర్‌, ‌ఖమ్మం, నల్లగొండలో పది నుంచి 17 వరకు కేసులు నమోదయ్యాయి. తక్కువ నమోదవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభించే నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు సెప్టెంబర్‌ ఒకటిన పున:ప్రారంభమైన వారం లోపే కొరోనా ప్రభావం వాటిపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 నుండి 20 మంది దాకా విద్యార్థులు, ఉపాధ్యాయులు దీని బారిన పడ్డారు. నల్లగొండ ప్రైవేటు పాఠశాలలో అధ్యాపకులు, విద్యార్దులకు పాజిటివ్‌ ‌సోకగా, ఆ పాఠశాల ప్రిన్సిపల్‌ ‌మృతిచెందడం కలకలం సృష్టించింది. ఆ పాఠశాలకు తాత్కాలికంగా సెలవు ప్రకటించి, శానిటైజ్‌ ‌చేసి తిరిగి ప్రారంభించారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం భయపడి పోతున్నారు.

ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం, జనగామ, వరంగల్‌ ‌జిల్లాల్లో ఇలాంటి సన్నివేశాలు జరిగాయి. ఆయా జిల్లాలో దాదాపు పది నుండి 20 వరకు పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో దాదాపు 33 వేల 376 కేసులు నమోదు అయినాయి. వారిలో మూడు వందలమంది వరకు మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్య ప్రజలను ఆందోళన పరుస్తున్నది. ఇష్టంలేకపోయినా ప్రత్యక్ష తరగతులకు పంపిస్తున్నప్పటికీ, ఆన్‌ ‌లైన్‌ ‌తరగతులవైపే వారు మొగ్గుచూపిస్తున్నారు. ఆ భయం కారణంగానే ఇప్పటివరకు 30 నుండి 35 శాతం విద్యార్థులే తరగతులకు హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే థర్డ్‌వేవ్‌ ‌భయం ఇంకా పోవడంలేదు.

పిల్ల మీద అధిక ప్రభావం చూపిస్తుందంటున్న నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభకావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. వచ్చేనెల దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఆ విషయంలోనే ఆందోళ పడుతుండగా, మరో వైపు డెల్టావేవ్‌ ‌భయం కూడా ఇంకా పోలేదు. ఇప్పుడు ఫోర్త్‌వేవ్‌కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది వేసవిలో విజృంభించే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తంమీద ఈ కొరోనా అన్నది అయిదారు సంవత్సరాలవరకు కొనసాగే అవశాలున్నాయంటున్నారు. ఏదేమైనా దానితో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. అప్పటివరకు మాస్క్, ‌శానిటైజ్‌లతో పాటు దూరం పాటించడంకన్నా మరో మార్గంలేదని చెబుతున్నారు.

Manduva-Ravinder-Rao
– మండువ రవీందర్‌రావు

Leave a Reply