Take a fresh look at your lifestyle.

ఏపీలో కొత్తగా 1,322 కొరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో 1,263 కరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మందికి, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ‌వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేసింది.ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16,712 మందికి  కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 1,322 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,019కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 424 మంది కోవిడ్‌ ‌నుంచి కోలుకొని డిశ్చార్జ్ ‌కాగా, ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 239కి చేరింది. ఈ రోజు మృతి చెందిన ఏడుగురిలో శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,860 యాక్టీవ్‌ ‌కేసులు ఉన్నాయి.

8,422 మంది రికవరీ
అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారినపడ్డ వారిలో 8,422 మంది రికవరీ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో 18,697 మందికి కరోనా సోకగా 10,043 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ 232 మంది మృతి చెందారు.ఆదివారం ఒక్కరోజే 961 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 157 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 14 మంది మృతి చెందారు. కర్నూలులో ఐదుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరు, కడపలో ఇద్దరు చొప్పున, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.

Leave a Reply