Take a fresh look at your lifestyle.

నేడు సివిల్స్ ‌ప్రవేశ పరీక్ష దేశవ్యాప్తంగా 72 నగరాల్లోని 2,569 కేంద్రాలు

‌యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్స్ ‌ప్రిలిమ్స్ ‌పరీక్ష నేడు దేశవ్యాప్తంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పకడ్బందీ కోవిడ్‌ ‌నిబంధనలతో యూపీఎస్‌సి పరీక్షను నిర్వహిస్తున్నది. పరీక్షకు సంబంధించి సుప్రీమ్‌కోర్టు తీర్పు తరువాత నిర్ణీత షెడ్యూల్‌ ‌ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. కోర్టు ఆదేశాలను అనుసరించి యూపీఎస్‌సీ దాఖలు చేసిన అఫిడవిట్‌ ‌ప్రకారం.. ఈ ఏడాది సివిల్స్ ‌ప్రిలిమినరీ పరీక్షలకు 10.58 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం నాటికి రిజిస్టర్డ్ అభ్యర్థులలో 65 శాతం మంది అడ్మిట్‌ ‌కార్డులను డౌన్‌లోడ్‌ ‌చేసుకున్నట్లు సమాచారం. దేశంలోని 72 నగరాల్లోని 2,569 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనున్నది.

సివిల్స్ ‌ప్రిలిమ్స్ ‌రాసే అభ్యర్థులకు సరైన రవాణా సౌకర్యం కల్పించాలని అన్ని రాష్ట్రాల చీఫ్‌ ‌సెక్రటరీలకు క్యాబినెట్‌ ‌కార్యదర్శి, యూపీఎస్సీ కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలన్నారు. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రతి సంవత్సరం ఇండియన్‌ అడ్మినిస్టేట్రివ్‌ ‌సర్వీస్‌ (ఐఏఎస్‌), ఇం‌డియన్‌ ‌ఫారిన్‌ ‌సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌), ఇం‌డియన్‌ ‌పోలీస్‌ ‌సర్వీస్‌ (ఐపీఎస్‌) ‌లకు అధికారులను ఎన్నుకోవటానికి యూపీఎస్‌సీ మూడు దశల్లో ప్రాథమిక, ప్రధాన పరీక్షలు, ఇంటర్వ్యూను నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్క్ ‌లేదా ఫేస్‌ ‌కవర్‌ ‌ధరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్షా హాలులో పారదర్శక సీసాలలో శానిటైజర్లను తీసుకెళ్లవచ్చు.  పరీక్ష ప్రారంభానికి గంట ముందు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. అభ్యర్థులు విధిగా బ్లాక్‌ ‌బాల్‌ ‌పాయింట్‌ ‌పెన్ను తీసుకెళ్లాలి. అభ్యర్థులు ఫొటో ఐడీ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. పరీక్ష రాయడానికి స్క్రైబ్‌ ఈ-అడ్మిట్‌ ‌కార్డును విడిగా ఇస్తారు. పరీక్షా గదికి కమ్యూనికేషన్‌ ‌పరికరాలను, మొబైళ్లను అనుమతించరు.  అభ్యర్థులు సాధారణ రిస్ట్ ‌వాచ్‌ను ధరించవచ్చు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply