Take a fresh look at your lifestyle.

తెలంగాణ చరిత్రలో ఇదో చీకటి రోజు …

  • ఒక వ్యక్తి మూఢ నమ్మకానికి వేల కోట్ల నష్టం …ఉత్తమ్
  • సీఎస్ సోమేశ్ కుమార్ కంటే తోటమాలి మేలు …జగ్గారెడ్డి
  • కేసీఆర్ కావాలంటే ఔటర్ రింగ్ రోడ్డు లో సెక్రెటేరియేట్ కట్టుకో …జీవన్ రెడ్డి
  • తెలంగాణ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి …షబ్బీర్ అలీ

ఒక్క వ్యక్తి మూఢ నమ్మకానికి వేల కోట్లు నష్టం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.ప్రజలు మరనిస్తుంటే కేసీఆర్ కు మానవత్వం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లో ని ఆయన నివాసం లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,మాజీ మంత్రులు షబ్బీర్ అలీ ,శ్రీధర్ బాబు ,ఎమ్మెల్యే జగ్గారెడ్డి ,కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ,ఇతర నాయకులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ … సచివాలయ భవనాలకు ఇంకా వందేళ్ల లైఫ్ ఉందని పిచ్చి తుగ్లక్ రాజ్యం లో ఒక్క కుటుంబం కోసం ప్రజలంతా నష్టపోవాల అని ప్రశ్నించారు.ఈ రోజు వ్యక్తిగతంగా కూడా నాకు బాధాకరమైన రోజని తెలంగాణ చరిత్ర లో ఈ రోజు ఒక బ్లాక్ డే అన్నారు. రాష్ట్రం లో న్యాయ వ్యవస్థపై కూడా ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని విమర్శించారు.సచివాలయ కూల్చివేతలు కేసీఆర్ కు సిగ్గుచేటన్నారు.సీఎస్ గా సోమేశ్ కుమార్ నియమకమే ఇల్లీగలని ఆయన వేరే రాష్ట్రం కేడర్ కు చెందినవాడని సీఎస్ గవర్నర్ పిలిస్తే కూడా రాకపోవడం సరికాదని మండిపడ్డారు.

గవర్నర్ సీఎస్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు. కరోనా విజృంభనతో కేసీఆర్ పారిపోయరని కరోనా టైం లో చీకటికోణలో పాల్గొంటున్న ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా సిగ్గుపడాలని అన్నారు .కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని లేదంటే ఉద్యమం చేస్తామన్నారు. అలాగే మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ … అర్ధరాత్రి దొంగ ల సచివాలయం కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అధికారులు మాట వినాలంటే గవర్నర్ గారు విభజన చట్టం లో ఉన్న సెక్షన్ 8 ని అమలు చేయాలనీ అన్నారు.

సీఎస్ కంటే తోటమాలి బెటర్ ….!

ఉత్తమ్ నివాసం లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ …సీఎస్ సోమేశ్ కుమార్ కంటే ఇంట్లో పనిచేసే తోటమాలి బెటర్ అని మానవత్వం లేకుండ పని చేస్తున్నారని విమర్శించారు.ఎమ్మెల్యే హోదాలో ఉన్న నేను నా కౌన్సిలర్ ని కాపాడుకోలేకపోయానని అన్నారు. గాంధీ లో రోగులకు చికిత్స ఇవ్వడానికి కనీసం 10 గంటల సమయం పడుతుందని డాక్టర్ల సంఖ్య తక్కువ- రోగుల సంఖ్య ఎక్కువ ఉండటం వల్ల సమన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పీసీసీ కార్యచరణ తీసుకొని పోరాటం ఉధృతం చేయాలన్నారు.మాజీ మంత్రి ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ …సీఎం కేసీఆర్ క్వరంటాయిన్ లో ఉన్నారు- పాలన ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. సీఎం లేకపోవడంతో గవర్నర్ రివ్యూ చేద్దాం అంటే సీఎస్ తో పాటు అధికారులెవ్వరూ స్పందించకపోవడం బాధాకరమని దీని ఖండిస్తున్నామని అన్నారు.

Leave a Reply