Take a fresh look at your lifestyle.

నేడు అయోధ్యలో భూమి పూజ

రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు భారీగా ఏర్పాట్లు
స్వయంగా పర్యవేక్షించిన సిఎం యోగి ఆదిత్యనాథ్‌

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి నేడు బూమి పూజకు సర్వం సిద్ధమయింది. ప్రధాని మోడి పాల్గొంటున్న కార్యక్రమానికి యుపి సిఎం యోగి ఆదిత్య నాథ్‌ ‌ప్యవేక్షణలో భారీ స్థాయాలో ఏర్పాట్లు చేశారు. యోగి ఆదిత్యనాథ్‌ ‌స్వీయ పర్యవేక్షణలో ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. అందరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండి దీపాలు వెలిగించి రామాయణ పారాయణ చేయాలని ఆయన కోరారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆయన ఉన్నతాధికారులతో సుదీర్ఘ సక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన 175 మందిలో 135 మంది సాధుసంతులని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ‌ట్విటర్‌లో పేర్కొంది. ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న బీజేపీ సీనియర్‌ ‌నేత ఉమాభారతి.. కొరోనా ముప్పు నేపథ్యంలో తాను హాజరు కాబోనని తెలిపారు. బాబ్రీమసీదు-రామజన్మభూమి కేసులో కక్షిదారు అయిన ఇక్బాల్‌ అన్సారీ మాత్రం.. తనకు ఆహ్వానం అందినందున ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని స్పష్టం చేశారు. కోర్టు తీర్పుతో వివాదం ముగిసిందని ఆయన పేర్కొన్నారు. ట్రస్టు ద్వారా ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని సుప్రీమ్‌కోర్టు ఆదేశించగా.. అందుకు భిన్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో పాల్గొనడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఈ కార్యక్రమాన్ని చరిత్రాత్మకంగా అభివర్ణించారు.

500 ఏళ్ల తర్వాత రామాలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న ఈ సందర్భం ఉద్వేగభరితమైనదని పేర్కొన్నారు. కొత్త భారతదేశానికి ఇది పునాది అని వ్యాఖ్యానించారు. ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని దూరదర్శన్‌ ‌ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ప్రధాని మోడీ సహా కేవలం ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంది. అయోధ్యలో నిర్మించబోయే రామ మందిర భూమి పూజకు 175 మంది ప్రముఖ అతిథులను ఆహ్వానించినట్లు రామ్‌ ‌జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి  తెలిపారు. బీజేపీ సీనియర్‌ ‌నేతలైన ఎల్‌కే అద్వానీ, మురళి మనోహర్‌ ‌జోషి, న్యాయవాది కె పరాశరన్‌, ఇతర ప్రముఖులతో చర్చల అనంతరం ఆహ్వాన జాబితా తయారు చేశామని ట్రస్ట్ ‌ప్రధాన కార్యదర్శి చంపత్‌ ‌రాయ్‌ ‌తెలిపారు.

ఈ కార్యక్రమానికి అనేక మంది ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన 135 మంది సన్యాసులతో సహా 175 మంది ప్రముఖ అతిథులు హాజరవుతారని, ఆలయ పట్టణంలోని కొందరు ప్రముఖ పౌరులను కూడా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. దివంగత వీహెచ్‌పీ నాయకుడు అశోక్‌ ‌సింఘాల్‌ ‌మేనల్లుడు సలీల్‌ ‌సింఘాల్‌ ఈ ‌కార్యక్రమానికి ‘యజ్మాన్‌’ ‌గా ఉంటారని, బీహార్‌ ‌జనక్‌పూర్‌కు, ఉత్తర ప్రదేశ్‌, అయోధ్యలతో సంబంధాలు ఉన్నందున నేపాల్‌ ‌నుంచి హిందూ దర్శకులను కూడా ఆహ్వానించినట్లు రాయ్‌ ‌తెలిపారు. ఆలయ రూపకల్పనపై ఆధారపడిన పోస్టల్‌ ‌స్టాంప్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందని, ప్రధాని ప్రాంగణంలో ‘పారిజాత’  చెట్టును నాటనున్నట్లు రాయ్‌ ‌వెల్లడించారు. వేడుక మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. ఆలయ శిలాశాసనం కూడా ప్రారంభిస్తామని తెలిపారు. కొరోనా మహమ్మారి నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, హిందూ ఆచారాల్లో ఎలాంటి రంగు నిషేధించబడదని, దేవతలు ధరించే బట్టల రంగును పూజారులు నిర్ణయిస్తారని రాయ్‌ ‌తెలిపారు.

Leave a Reply