Take a fresh look at your lifestyle.

నేడు 30 మంది ఉత్తమ మహిళలకు అవార్డులు

అం‌తర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం అవార్డులను ప్రకటించారు. ప్రతీ ఏటా ఈ అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది. ప్రభుత్వం నియమించిన సెలబ్రేషన్‌ ‌కమిటీ చైర్మన్‌గా ఉన్న స్గ్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఈమేరకు 30 మంది ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా విజేతలైన మహిళలకు రూ. లక్ష నగదుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.

- Advertisement -

విజేతల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: సయ్యద్‌ ‌సల్వా ఫాతిమా (ఏవియేషన్‌), ‌మల్లారి జమ్ము, పల్లె రాణి, మంగ్లి సత్యవతి (జానపద సంగీతం), వంగీపురం నీరజాదేవి (శాస్త్రీయ నృత్యం), ఐనంపూడి శ్రీలక్ష్మి, ప్రొ.సూర్య ధనంజయ (సాహిత్యం), లక్ష్మీరెడ్డి (పెయింటింగ్‌), ‌మంజులా కల్యాణ్‌ (‌స్వయం కృషి),  బొండా రామలీల (శిషు సేవలు), సరిత (మహిళల హక్కులు), స్రవంతి, దీక్షిత, శ్యామల గోలి (క్రీడలు), నిర్మలా రెడ్డి (జర్నలిజం), బేగరి లక్ష్మమ్మ (వ్యవసాయం), మిల్కూరి గంగవ్వ (సోషల్‌ ‌మీడియా), మంజులా రెడ్డి (సైన్స్, ‌రీసర్చ్), ‌పవార్‌ అనిత (స్టాఫ్‌ ‌నర్స్), ‌శారద (ఏఎన్‌ఎం), ‌పూనం కవిత (ఆశ వర్కర్‌), ‌సంధ్యా రాణి, ఎన్‌విఎల్‌ ‌సౌజన్య, టేకం యమునాబాయి (స్రీ, శిశు అభివృద్ధి సేవలు), మనిషా సాబూ (కార్పొరేట్‌ ‌సేవలు), ఉషారాణి (వ్యాపారం), అంజలి దేవి (మెడిసిన్‌), అరుణా దేవి (యోగ) రంగాలలో విషేశ కృషి చేసినందుకుగాను వీరికి అవార్డులను అందజేయనున్నారు.

Leave a Reply