Take a fresh look at your lifestyle.

పెంచిన రైల్వే చార్జీలను ఉపసంహరించుకోవాలని సిపిఎం దిష్టిబొమ్మ దగ్ధం

To withdraw the increased railway charges Demands Cpm Partyసుబేదారి: పెంచిన రైల్వే చార్జీలను వెంటనే ఉపసంహ రించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ హన్మకొండ అంబేద్కర్‌ ‌క్రాస్‌రోడ్‌ ‌వద్ద సిపిఎం వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా కమిటి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం సిపిఎం జిల్లా ఇంచార్జి కార్యదర్శి జి.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే చార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపి స్వల్పంగానే పెంచామని చెప్పడం ప్రజలను మోసంచేయడమేనన్నారు. వివిధ రైళ్లపై 3రకాల స్లాబ్స్ ‌విధిస్తూ పెంచుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి పియూష్‌గోయల్‌ ‌ప్రకటించడాన్ని ఆయన దుయ్యబట్టారు.

రైలు అంటే సామాన్య ప్రజలు ఎక్కేదని సాధారణమైన రైల్వే ప్రయాణీకులపై చార్జీలు పెంచడం అత్యంత దుర్మార్గమైన విషయమన్నారు. తక్షణమే పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చుక్కయ్య మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో జిఎస్‌టి పేరుతో, బస్‌చార్జీలు, ఉల్లిధరలు, నిత్యావసర ధరల భారాలతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అది చాలదన్నట్టు కేంద్రం రైల్వే చార్జీలు పెంచి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా చేసిందన్నారు. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోకపోతే మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని ఆయన హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మొట్టక కుమారస్వామి, గొడుగు వెంకట్‌, ఐనవోలు మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags: withdraw increased, railway charges, methaka kumara swamy, bus charges

Leave a Reply