Take a fresh look at your lifestyle.

వియత్నాం విజయానికి స్ఫూర్తినిచ్చిన రాణా ప్రతాప్‌ ‌సింగ్‌

నేడు మహారాణా జయంతి

ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాతో 20 ఏళ్లు పోరాటం చేసి, ఎదురే లేదనుకుని విర్రవీగిన అమెరికా మెడలు వంచి విజయం సాధించిన దేశం వియత్నాం.   అమెరికాపై సాధించిన విజయం తర్వాత వియత్నాం అధ్యక్షుడిని ఒక విలేకరి ఇలా ప్రశ్నించాడు. ‘‘మీరు అమెరికాను ఎలా ఓడించారో ఎవరికీ అంతుబట్టడం లేదు’’ అని. ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు వియత్నాం అధ్యక్షుడు చెప్పిన సమాధానం… ‘‘శక్తివతంమైన అమెరి కాను ఓడించడానికి నేను గొప్ప దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను…. ఆయన  జీవితం నుంచి ప్రేరణ పొంది యుద్దనీతి, ప్రయోగాలతో విజయం సాధించాం’’ అని అన్నాడు .ఎవరా భారతీయ రాజు? అని విలేకరి అడిగితే వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి ఆయనే  రాజస్థాన్‌లోని ‘‘మేవాడ్‌ ‌వీరుడు మహారాజు రాణా ప్రతాప్‌ ‌సింగ్‌’’ అని గర్వంగా ప్రకటించాడు. మహారాణా ప్రతాప్‌ ‌సింగ్‌ ‌పేరు చెప్పేటప్పుడు అతడి కళ్లల్లో వీరత్వం తొణికిస లాడింది. ‘‘అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించే వారమని’’ అన్నాడు. కాలక్రమంలో వియత్నాం అధ్యక్షుడు చనిపోయిన తర్వాత అతడి సమాధి మీద ‘‘ఇది మహారాణా ప్రతాప్‌ ‌యొక్క శిష్యుడిదని’’ రాశారు. కొన్నేళ్లకు వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి రావడం జరిగింది. దేశంలోని గొప్ప వారికి శ్రద్ధాంజలి ఘటించ డానికి ఆయనకు మొదట గాంధీ సమాధి చూపించారు. ఆ తర్వాత ఎర్రకోట ఇలా చూపించే టప్పుడు… వియత్నాం మంత్రి మహారాణా ప్రతాప్‌ ‌సమాధి ఎక్కడ? అని ప్రశ్నించాడు. ఆ మంత్రి ప్రశ్నకు ఆశ్చర్య పోయిన భారత అధికారి ఉదయపూర్‌లో ఉందని తెలిపాడు. ఆయన ఉదయ్‌పూర్‌ ‌వెళ్లి సమాధిని దర్శించి, అక్కడ నుంచి ‘‘పిడికిడు మట్టిని’’ తీసుకొని తన బ్యాగ్‌లో వేసుకున్నాడు. దీన్ని గమనించిన భారత అధికారి మట్టిని బ్యాగ్‌లో ఎందుకు పెట్టు కున్నారని అడిగాడు…. ఇదే మట్టి దేశ భక్తులైన వీర పుత్రులకు జన్మనిచ్చింది… అందుకే దీన్ని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతాను. ఇలాంటి రాజు ప్రేరణతో అక్కడ కూడా దేశభక్తులు జన్మిస్తారని…. మహారాణా ఈ దేశమే కాదు ప్రపంచం గర్వించదగ్గ రాజని’’ అన్నాడు.

రాజపుత్ర వీరుడు మహారాణా ప్రతాప్‌ 1540 ‌మే 9 (జ్యేష్ఠ శుక్ల తదియ) రాజస్థాన్‌లోని కుంబల్‌లో జన్మించాడు. 1568లో మేవాడ్‌ ‌పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన మహారాణా 1597 వరకు పరిపాలించాడు. గొప్ప చక్రవర్తిగా చరిత్రకారులు పేర్కొన్న అక్బర్‌ ఆ ‌సమయంలో ఢిల్లీ సింహాసనాన్ని పాలిస్తున్నాడు. స్వాతంత్రం, ఆత్మ గౌరవం కోసం నిరంతంరం మొఘలులతో పోరాటం చేస్తూ రాణా ప్రతాప్‌ ఏనాడు తల వంచలేదు. మహారాణా ప్రతాప్‌ ఒకసారి తలదించి, తన కాళ్లమీద పడితే సగం హిం దూస్థాన్‌కు రాజును చేస్తానని అక్బర్‌ ‌ప్రతిపాదిస్తే, దాన్ని తుచ్ఛమైందిగా తిరస్కరిం చాడు.ఒకసారి భారత్‌ ‌పర్యటన కోసం అబ్రహాం లింకన్‌ ‌సిద్దమవు తుండగా తన తల్లిని తిరిగి వచ్చే టప్పుడు ఏమి తీసుకు రావాలని అడిగాడు. దానికి ఆమె రాజస్థాన్‌లోని ‘‘మేవాడ్‌ ‌నుంచి పిడికెడు మట్టి తీసుకురా’’, అక్కడి రాజు ఎంత విశ్వస పాత్రుడిగా ఉండే వాడంటే సగం దేశాన్ని ఇస్తామని ప్రలోభపెట్టినా తన మాతృ భూమినే కోరుకున్నాడు, కానీ స్వార్థం చూప లేదని  చెప్పిందట. అయితే కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దయ్యింది. ఈ విషయాలు ‘‘బుక్‌ ఆఫ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌యుఎస్‌ఏ’’‌లో పేర్కొన్నారు.

మహారాణా ప్రతాప్‌ 7 అడుగుల ఎత్తు ఉండేవాడు. 235 కిలోల బరువున్న మహారాణా యుద్ధ సామగ్రి ఉదయపూర్‌ ‌ప్యాలెస్‌లో భద్రపరచ బడింది. భాలా (ఈటె) మాత్రమే 35 కిలోల బరువు ఉంటుంది. అల్‌ ‌బరౌని అనే రచయిత మహారాణా ప్రతాప్‌ ‌దగ్గర ఉన్న ‘‘రాంప్రసాద్‌’’ అనే ఏనుగు గురించి తన పుస్తకంలో రాశాడు. మేవాడ్‌ ‌మీద యుద్దం చేసేటప్పుడు మహారాణా ప్రతాప్‌ ‌తోపాటు అయన ఏనుగు రాంప్రసాద్‌ను కూడా బంధిగా పట్టుకుంటే సరిపోతుందని అక్బర్‌ ‌తన సైన్యంతో అన్నాడు. రాంప్రసాద్‌ ‌మొఘలకు చెందిన 13 ఏనుగులను హత మార్చింది. అలాగే దాన్ని బంధించడానికి 7 పెద్ద ఏనుగుల మీద 14 మంది నైపుణ్యం కలిగిన మావటిలు చక్రవ్యూహం పన్నారని అల్‌ ‌బరౌని తన రచనలో పేర్కొన్నాడు. బంధించిన రాంప్రసాద్‌ను అక్బర్‌ ‌ముందు నిలబెడితే దానికి ‘‘పీర్‌ ‌ప్రసాద్‌’’ అని నామకరణం చేశాడు. అయితే ఆ ఏనుగు 18 రోజుల వరకు మంచి నీళ్లు కూడా ముట్టు కోకుండా ప్రాణాలు కోల్పోయింది. తర్వాత ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్‌ ఈ ఏనుగునే వంచలేక పోయాను… మహారాణాను ఎలా వంచగలుగుతా అని అన్నాడట. మహా రాణా ప్రతాప్‌ ‌సింహ్‌ ‌చనిపోయాక అక్బర్‌ ‌కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు చరిత్ర కారులు పేర్కొన్నారు.

రాణా గుర్రం అయిన ‘‘చేతక్‌’’ ‌మహారాణాను మోస్తూ, 26 అడుగుల కందకం మీద నుంచి దూకి అది దాటిన తరువాత చనిపోయింది. అంతకంటే ముందే దానికి ముందు కాలు విరిగి ఉన్నప్పటికి ఆ కందకాన్ని దుమికింది. అది ఎక్కడైతే చనిపోయిందో, అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్‌ ‌మందిరం కట్టారు. చేతక్‌ ఎం‌త బలమైనదంటే తన ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందు కోవటానికి అంత ఎత్తులో గాలిలో ఎగిరేది. అంతటి శక్తి కలిగినది కనుకే చేతక్‌ ‌పేరును ద్విచక్ర వాహనానికి పెట్టడం గమనార్హం.హల్ది ఘాట్‌ ‌యుద్దం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నేలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుదం దొరికింది. ‘‘ఒంటరిగా, మరే రాజపుత్ర రాజ్యాల మద్దతూ లేకుండా మొగలు సామ్రాజ్యాన్ని ధిక్కరించిన రాణా ప్రతాప్‌ ‌శౌర్యం, రాజపుత్ర శౌర్య ప్రతాపాలను, వారి ఆత్మ గౌరవాన్నీ, వారి విలువలనూ వివరించే గొప్ప గాథ. రాణా ప్రతాప్‌ అవలంబించిన యుద్ధ తంత్రాన్ని ఆ తరువాత మాలిక్‌ అం‌బర్‌, ‌ఛత్రపతి శివాజీలు కూడా అనుసరించారని’’, చారిత్రికుడు సతీష్‌ ‌చంద్ర పేర్కొన్నాడు.
 – రామ కిష్టయ్య సంగనభట్ల…
   9440595494

Leave a Reply