Take a fresh look at your lifestyle.

 ‌కాలం చెల్లిన శాసనాలు

శతాబ్దిన్నర క్రితపు తెల్లోల్ల నల్ల చట్టమది
ప్రత్యుర్థులపై ఎక్కుపెట్టే ఆయుధమది
కాలం చెల్లిన మెకాలే రాజద్రోహ శాసనమది
డిజిటల్‌ ‌కాలపు డేంజరస్‌ ‌పాత శిక్షాస్మృతది !

నాటి రాజద్రోహ చట్టానికి చెల్లుచీటీలు
సుప్రీమ్‌ ‌వేసెను నల్లచట్టాలకు బ్రేకులు
బ్రిటీష్‌ ‌దాస్యశృంఖలాలు ఛేదించినా..
తెల్లతోలు చట్టాలకు నేటికీ పట్టాభిషేకాలా !

రాజద్రోహ చట్ట బాధితులు గాంధీ, తిలక్‌లు
భావప్రకటనా స్వేచ్ఛకు వేయవద్దు సంకెళ్ళు
దేశ భద్రత గీత దాటితే రాజద్రోహ శిక్షార్హులే
కాలం చెల్లిన శాసనాలకు చేయాలి సవరణలు !

అమృతోత్సవ భారతిలో స్వేచ్ఛకు రెక్కలు
పునఃసమీక్షతో నిగ్గుతేల్చాలి మంచిచెడులు
ఛేదించాలి మానవ హక్కుల కక్షల సంకెళ్ళు
ప్రతిష్టించాలి ప్రజాస్వామ్య పవిత్ర విలువలు !

  – మధుపాళీ
               కరీంనగర్‌ – 9949700037

Leave a Reply