- ఏడుగురికి రెండోసారి బూస్టర్ డోస్
- ‘స్పుట్నిక్ వీ’ పట్ల ఆచితూచి వ్యవహరించాలి.. వ్యాక్సిన్‌పై ఎయిమ్స్ డైరెక్టర్• కీలక వ్యాఖ్యలు..!
- రెండు వారాల్లో మార్కెట్లోకి కొరోనా వ్యాక్సిన్ : ప్రకటించిన రష్యా ఆరోగ్యశాఖ మంత్రి
కొరోనా వ్యాక్సిన్ తయారీలో భాగంగా నిమ్స్‌లో చేపట్టిన ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రాయల్స్ చివరి దశకు చేరుకుంది. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు వైద్య బృందం బూస్టర్ డోస్ ఇచ్చింది. మంగళవారం 11 మంది వాలంటీర్లకు నిమ్స్ వైద్య బృందం బూస్టర్ డోస్ ఇచ్చింది. బుధవారం మరో పదిమంది వాలంటీర్లకు బూస్టర్ డోస్‌ను వైద్య బృందం ఇవ్వనుందని సమాచారం. నిమ్స్‌లో కోవాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండో సారి ఏడుగురికి బూస్టర్ డోస్ ఇచ్చారు. మరో 43 మందికి దశల వారీగా ఇవ్వనున్నారు. మొదటి సారి క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 50 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అందులో 14 రోజులు గడిచిన వారిలో కొందరిని ఎంపిక చేసి నిర్దారిత సమయాల్లో బూస్టర్ డోస్ ఇస్తున్నారు. అందరి ఆరోగ్య పరిస్థితిని వీడియో కాల్ ద్వారా ప్రతి రోజూ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 24 గంటలపాటు హాస్పిటల్లోనే ఉంచి..ఆరోగ్యం నిలకడగా ఉంటేనే ఇళ్లకు పంపిస్తున్నారు. రెండో డోసు తీసుకున్న ఏడుగురితో కలిపి మొదటి డోసు వేసుకున్న వారందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్య బృందం నిర్దారించుకుంది.
‘స్పుట్నిక్ వీ’ పట్ల ఆచితూచి వ్యవహరించాలి : రష్యా వ్యాక్సిన్‌పై ఎయిమ్స్ డాక్టర్ కీలక వ్యాఖ్యలు..!
రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ’స్పుట్నిక్ వీ’ పై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియ కీలక వ్యాఖ్యలు చేసారు. ’స్పుట్నిక్ వీ’ పట్ల ఆచితూచి వ్యవహరించాలని అన్నారు. వ్యాక్సిన్‌ను వాడే ముందుగా సురిక్షితమైనదా, ప్రపంచస్థాయి ప్రమాణాలను కలిగిఉందా అనేది పరిశీలించాలని తెలిపారు. వ్యాక్సిన్ పరీక్షల శాంపిల్ పరిమాణం, దీని సామర్థ్యం వంటి ప్రాతిపదికన భద్రతను పసిగట్టవచ్చని తెలిపారు. వ్యాక్సిన్‌తో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఎంతకాలం కొనసాగుతాయనేది కూడా పరిశీలించాలని తెలిపారు. మొదట వ్యాక్సిన్ సురక్షితమైనదా లేదా అనేది వెల్లడికావాల్సి ఉందని, పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టేముందు ఇది ప్రాథమిక అంశమని ఆయన అన్నారు. తుది పరీక్షలు పూర్తి చేయకుండానే అధ్యక్షుడు పుతిన్ ను అభివృద్ధి చేశామని ప్రకటించటంతో గులేరియ చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరింది.
రెండు వారాల్లో మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్ : ప్రకటించిన రష్యా ఆరోగ్యశాఖ మంత్రి
ప్రపంచంలోనే మొదటి కోవిడ్ టీకా ‘స్పుత్నిక్ వీ’ని రిజిస్టర్ చేసిన రష్యా ఇందుకు సంబంధించిన మరో శుభవార్త తెలిపింది. ఈ టీకా మొదటి బ్యాచ్ రెండు వారాల్లో విడుదల కానుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో బుధవారం వెల్లడించారు. ‘టీకా స్వచ్ఛందంగానే ఉంటుంది. కొరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి ఉన్న 20 శాతం మంది వైద్యులకు వ్యాక్సిన్ అవసరం లేదనుకుంటున్నాం. అది నిర్ణయించాల్సిన బాధ్యత కూడా వారికే వదిలేశాం.’ అని పేర్కొన్నారు. మొదట రష్యా అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యతమిస్తామని మురాష్కో పేర్కొన్నారు. అలాగే, కొంతమేరకు వ్యాక్సిన్ ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తామన్నారు. అయితే, దేశీయ మార్కెట్ అవసరాలకే తమ మొదటి ప్రాధాన్యం అని నొక్కిచెప్పారు. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రపంచంలోనే మొట్టమొదటి కొరోనా వైరస్ వ్యాక్సిన్‌ను నమోదు చేసింది. ‘స్పుత్నిక్ వీ’ అనే వ్యాక్సిన్‌ను గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.