సింగరేణిలో రోజు రోజుకు పెరిగిపోతున్న ప్రమాదాలకు, కాంట్రాక్ట్ కార్మికుల మరణాలకు సింగరేణి యజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని సిఐటియు అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బండి రాజేష్ డిమాండ్ చేశారు. బుదవారం ఎస్ఎంఎస్ ప్లాంట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గోదావరి ఖనిలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంట్రాక్టర్‌పై హత్యనేరం క్రింద కేసులను పైల్ చేయాలన్నారు.
పని ప్రదేశాల్లో సక్రమంగా పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ మరణాలకు కారణమైన ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఈ ప్రమదంలో గాయాలపాలైన, మృతి చెందిన కార్మికులకు సింగరేణి యజమాన్యమే పూర్తి బాధ్యత వహించి, మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబానికి కోటి రూపాయలు, గాయాలపాలైన కార్మికులకు రూ.50లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించి, కుటుంబంలోని ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు క్రిష్ణయ్య, మాధవరావు, బాలక్రిష్ణ, నవీన్, రవి, రఘు తదితరులు పాల్గొన్నారు.