Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ,‌టీఆర్‌ఎస్‌ ‌లకు… ‘ఆత్మ’ ప్రబోధం ..!

  • టిపిసిసిపై  స్కెచ్‌!?
  • ‌వొచ్చే ఎన్నికల్లో  టిఆర్‌ఎస్‌తో పొత్తే లక్ష్యం
  • మొయినాబాద్‌ ‌ఫాంహౌస్‌ ‌కేంద్రంగా ప్రణాళిక
  • ఖాన్‌ ‌రాజీనామా వెనుక  అదృశ్య హస్తం?

(ఎ.సత్యనారాయణరెడ్డి / హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హుజూరాబాద్‌ ‌బై ఎలక్షన్‌ ‌ఫలితం రాష్ట్రంలో కొత్త సమీకరణలు, కొత్త పొత్తులు పెట్టుకోవడానికి బీజం వేయనున్నాయా? హుజూరాబాద్‌లో బిజెపి అభ్యర్థి రాజేందర్‌ ‌గెలుపొందడంతో అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ మరో పార్టీతో పొత్తుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  పాత మిత్రులైన  టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ మళ్లీ పొత్తు పెట్టుకోనున్నాయా? వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందుతున్నాయా? దీని కోసం ‘ఆత్మ’ తన మార్కు వ్యూహాలు, ప్రయాత్నాలు మొదులపెట్టారా?అంటే విశ్వసనీయ వర్గాలు ఔననే అంటున్నాయి.  టిపిసిసి క్రమశిక్షణ కమిటీ వైఎస్‌ ‌ఛైర్మన్‌ ‌పదవికి ఎంఎ ఖాన్‌ ‌రాజీనామా చేయడం వెనుక ఏం జరిగింది? పదవీ ప్రకటన జరిగిన తర్వాత మూడు రోజులు మౌనంగా ఉన్న ఖాన్‌ ‌సడెన్‌గా నాకొద్దు ఈ పదవీ అని రాజీనామా పత్రం సమర్పించడం వెనుక ఏ అదృశ్య హస్తం ఉంది? తెలంగాణ కాంగ్రెస్‌ ‌లో ఈ ప్రకంపనలకు కేంద్ర బిందువు ఎక్కడుంది? తెలంగాణ కాంగ్రెస్‌ ‌ను మరోసారి ‘ఆత్మ’ ఆవహించిందా? ఎంఎ ఖాన్‌ ‌రాజీనామా వెనుక ఉన్న భారీ స్కెచ్‌ ఏమిటి? గాంధీ భవన్‌ ‌వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు టిపిసిసిలో తాజా రాజకీయ ఎత్తులు,  పై ఎత్తులపై ‘ప్రజాతంత్ర’తెలంగాణ దినపత్రిక సమగ్ర విశ్లేషణ…

‘ఆత్మ’ ఫాంహౌస్‌ ‌పాలి‘ట్రిక్స్’…
‌హైదరాబాద్‌ ‌నగరానికి సమీపంలోని మొయినాబాద్‌… ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుకు 20-30 కిలో మీటర్ల దూరంలో ప్రముఖుల ఫాంహౌస్‌లు నెలకుని ఉండే ప్రాంతం ఇది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తకు ఈ ప్రాంతంలో ఓ ఫాంహౌస్‌ ఉం‌ది. ఆ ఫాంహౌస్‌ ‌కేంద్రంగానే ఇప్పుడు తెలంగాణ  కాంగ్రెస్‌లో కొత్త ఎత్తుగడలకు తెర లేచిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకనాటి ‘ఆత్మ’ ఇప్పుడు మళ్లీ ఈ ఫాంహౌస్‌ ‌కేంద్రంగా చక్రం తిప్పటం మొదలు పెట్టిందని టాక్‌. ఆత్మ – ఆత్మకు తెలంగాణ  కాంగ్రెస్‌లో ఆత్మీయులు కలిసి ఈ ఫాంహౌస్‌ ‌కేంద్రంగా టిపిసిసినే టార్గెట్‌గా భారీ స్కెచ్‌కు మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌వేస్తున్నారని సమాచారం. ఆ ప్లాన్‌లో ఫస్ట్ ‌స్టెప్పే ఎంఎ.ఖాన్‌ ‌తాజా రాజీనామా అంటున్నారు.

‘ఆత్మ’ అజ్ఞానుసారం…
ఎంఎ ఖాన్‌… అసలు స్టోరీలోకి వెళ్లే ముందు ఒకసారి ఈయన నేపథ్యం చూద్దాం. ఖాన్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున రెండు పర్యాయలు (2008-2014, 2014-2020) రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి సారి ‘ఆత్మ’ సహకారంతో రాజ్యసభలోకి ప్రవేశించారు. అలా ‘ఆత్మ’కు ఖాన్‌కు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖాన్‌ను సోనియాగాంధీ తాజాగా టిపిసిసి  క్రమశిక్షణా కమిటీ వైఎస్‌ ‌ఛైర్మన్‌గా నియమించారు. ఆయన ఓకే చెప్పిన తర్వాతే ఈ నియామకం జరిగిందని గాంధీ భవన్‌ ‌వర్గాలు చెబుతున్నాయి. అట్లాంటిది… ప్రకటన వెలువడిన మూడు రోజుల వరకు సైలెంట్‌గా ఉన్న ఖాన్‌… ‌సడెన్‌గా పదవీ ఇచ్చే ముందు నన్ను సంప్రదించలేదు అని రాజీనామా ప్రకటించారు. ఒకవేళ సంప్రదించపోయినా, పదవి ఇష్టం లేకపోయినా పార్టీకి అంతర్గతంగా సమాచారం ఇవ్వొచ్చు, సోనియాకు లేఖ రాసి మౌనంగా ఉండొచ్చు. కానీ, రాజీనామా లేఖను మీడియాకు రిలీజ్‌ ‌చేయడం ‘ఆత్మ’ వ్యూహాంలో భాగమని చెబుతున్నారు.

‘ఆత్మ’ స్కెచ్‌ ‌కు నేపథ్యం…
రేవంత్‌ ‌రెడ్డి టిపిసిసి  అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్‌కు జవజీవాలు వచ్చాయన్నది వాస్తవం. భారీ బహిరంగ సభలతో కాంగ్రెస్‌ ఒకింత రేస్‌లోకి వచ్చింది. గడచిన నాలుగు నెలల్లో పార్టీ లేచి నడవడం మొదలు పెట్టింది. ముఖ్యంగా గజ్వేల్‌ ‌సభ తర్వాత కేడర్‌ ‌లో భవిష్యత్‌ ‌పట్ల ఆశలు చిగురించాయి. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ ‌పాత కాపులు కొందరికి ఈ దూకుడు అస్సలు నచ్చడం లేదు అన్నది కూడా జగమెరిగిన సత్యం. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతలు అడపా దడపా చేస్తోన్న ప్రకటనలతో కలకలం రేగుతూనే ఉంది. ఆ ప్రకటనలు తెలంగాణ కాంగ్రెస్‌ ‌కు కనిపించని నష్టాన్ని మూటగడుతున్నాయన్నది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిన అంశం. కాంగ్రెస్‌లో ఇది మామూలే అని సర్ధిచెప్పుకోవడానికి లేదు. రాజకీయాలు ఒకప్పటిలా లేవు. టిడిపికి కాంగ్రెస్‌, ‌కాంగ్రెస్‌కు టిడిపి మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉన్న రోజుల్లో ఇవన్నీ నడిచాయి.  ఇదంతా 20 ఏళ్ల క్రితం ముచ్చట. ఇప్పుడు కాలం మారింది. ప్రజలకు పొలిటికల్‌ ఆప్షన్స్ ‌పెరిగిపోయాయి. నిత్యం పోటీలో ఉంటే తప్ప గెలుపు అవకాశాలు ఉండవు. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీ నేతలైనా చేసే చర్యలు, మాట్లాడే మాటలు చాలా ప్రభావాన్ని చూపుతున్నాయి. మళ్లీ సమైక్య రాష్ట్రం చేస్తానంటే కేసీఆర్‌కు సహకరిస్తానంటూ జగ్గారెడ్డి ఇటీవల కామెంట్‌ ‌చేశారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా… ఆ ప్రకటన కాంగ్రెస్‌ ‌కు తీరని నష్టం చేసిందనే చెప్పాలి. ఆ విషయం జగ్గారెడ్డికి తెలియదా అంటే…ఏం చెబుతాం! ఇలాంటి ప్రకటనల వెనుక ‘ఆత్మ’ ఉన్నాడన్నది ఇన్‌ ‌సైడ్‌టాక్‌. ఇటువంటి ప్రకటనలే టిఆర్‌ఎస్‌కు రేపటి నాడు అస్త్రాలుగా మారతాయడంలో డౌట్‌ ‌లేదు.  ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రెండు రాష్ట్రాలను కలిపేస్తుంది… ఆ విషయం మేం చెప్పడం కాదు, టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డే చెప్పారు…’ అని ఎలక్షన్స్ ‌టైంలో కేసీఆర్‌ ‌దీన్ని అస్త్రంగా వాడుకోవడానికి ఛాన్స్ ఇచ్చినట్టే కదా! అన్నది కాంగ్రెస్‌ ‌వర్గాల భావన. ఇటీవల కోమటిరెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతల ప్రకటనలను ఆసరాగా చేసుకుని కేటీఆర్‌, ‌నమస్తే తెలంగాణ పత్రికల్లో వస్తోన్న కథనాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.  మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు కూడా గొంతెత్తారు. వీటి ఆంతర్యం చూస్తే ఇది మనకు చాలా స్పష్టంగా అర్ధము అవుతోంది.

అసలు ‘ఆత్మ’ స్కెచ్చేంటి…?
మళ్లీ ఖాన్‌ ‌రాజీనామా విషయానికి వద్దాం… ఖాన్‌ ‌రాజీనామా వెనుక ఆత్మ అదృశ్య హస్తం ఉందని చెబుతున్నారు. మొయినాబాద్‌ ‌ఫాంహౌస్‌ ‌తో పాటు, బంజారాహిల్స్ ‌లోని ఆత్మ అపార్ట్ ‌మెంట్‌ ‌కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్‌ ‌బడాబాబుల మీటింగ్స్ ‌రెగ్యూలర్‌గా జరుగుతున్నాయట. కొత్త తెలంగాణ పిసిసి కార్యవర్గాన్ని అస్థిరపరచడమే ఈ మీటింగ్స్‌లో చర్చల సారాంశంగా తెలుస్తోంది. దీనికి ఒక ఏడాది టార్గెట్‌గా పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టీంలో ఉన్న కొందరు నేతలను తమవైపునకు తిప్పుకునేందుకు ఆత్మ టీం సీరియస్‌గా వర్కవుట్‌ ‌చేస్తున్నట్టు చెబుతున్నారు. దీనిలో మాజీ పిసిసి అధ్యక్షుడు కీలక పాత్ర పోషిస్తున్నారని గుసగుస. రేవంత్‌ ‌రెడ్డికి పిసిసి  పదవి రాకుండా ఆ తాజా మాజీ పిసిసి  చివరి వరకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. టిపిసిసిలో ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న ఓ బిసి నాయకుడుకి  వీళ్లు తెలంగాణ పిసిసి  అధ్యక్ష పదవి ఎర వేసినట్టు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డిని తప్పించే పనిలో కలిసి వస్తే తదుపరి నీకే పిసిసి  పదవి ఇప్పిస్తాం అని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్టు టాక్‌. ‌నల్గొండ జిల్లాకు చెందిన మరో రెడ్డి నాయకుడుకి కూడా ఇదే ఆఫర్‌ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా… రేవంత్‌ ‌రెడ్డి చుట్టూ ఉచ్చుబిగించి, ఉక్కిరి బిక్కిరి చేయడమే ఆత్మ మిషన్‌గా చెబుతున్నారు. ఆ క్రమంలోనే మొదటి పావుగా ఖాన్‌తో రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించినట్టు సమాచారం.

రేవంత్‌ •డ్డి అందరినీ కలుపుకుని పోకపోవడంతోనే ఈ డిస్ట్రబెన్స్ అని అధిష్టానానికి చూపించడమే ఈ తాజా ఎత్తుగడ వెనుక ఆలోచనగా చెబుతున్నారు. కాలక్రమేణా అధిష్టానం వద్ద పదే పదే ఇదే విషయాన్ని ఎక్స్‌పోజ్‌ ‌చేస్తూ… టైం వచ్చినప్పుడు పిసిసి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం టాగూర్‌ ‌మార్పు అంశాన్ని సీరియస్‌గా తెర మీదకు తెచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేవ్‌శ్‌  ‌ముఖ్యమంత్రికి ఆత్మగా వ్యవహరించిన ఆత్మ… ఆయన పోయాక కేసీఆర్‌కు ఆత్మగా మారరని టిపిసిసిలో ఒక వర్గం ఎప్పటి నుంచో చెబుతోంది. ఇప్పుడు ఆత్మ ఆపరేషన్‌ ‌వెనుక కూడా కేసీఆర్‌ ‌ప్రయోజనాలే ఇమిడి ఉన్నాయని చెబుతున్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత టిఆర్‌ఎస్‌ ‌బలహీనపడుతోందన్న టాక్‌ ‌సీరియస్‌గా నడుస్తోంది. ఈటెల గెలుపు టిఆర్‌ఎస్‌ ‌వోటమికి సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ ‌సైజును ఎంత తగ్గించ గలిగితే కేసీఆర్‌కు అంత మేలు జరుగుతుందన్నది ఆత్మ వ్యూహాంగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ ‌మినీ కాంగ్రెస్‌గా మారిపోతే… టిఆర్‌ఎస్‌తో పొత్తు తప్ప ఆ పార్టీ ముందు మరో ఆప్షన్‌ ఉం‌డదు. అంటే… సేమ్‌ ‌తమిళనాడు తరహా అన్నమాట. తమిళనాడులో కాంగ్రెస్‌ అస్థిత్వం అంతంత మాత్రం. ఆ పార్టీకి డిఎంకేతో పొత్తు తప్ప మరో ఆప్షన్‌ ఉం‌డదు. సేమ్‌ ‌సీన్‌ ‌తెలంగాణలో రిపీట్‌ ‌చేయాలన్నది కేసీఆర్‌ ఆలోచన. తన ఆలోచనకు ‘ఆత్మ’ ద్వారా కార్యరూపం తీసుకురావాలన్నది కేసీఆర్‌ ‌స్కెచ్‌గా గాంధీ భవన్‌ ‌వర్గాల్లో టాక్‌. అదే జరిగితే 10-15 సీట్లు తీసుకుని టిఆర్‌ఎస్‌తో జట్టు కట్టడం ఒక్కటే కాంగ్రెస్‌కు మిగులుతుంది… ఈ నేపథ్యంలో తెలంగాణ  కాంగ్రెస్‌ ‌భవిష్యత్‌ ఎట్లా ఉంటుందన్నది పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ ద్వితియ శ్రేణి నేతలు, క్యాడర్‌ ‌డిసైడ్‌ ‌చేసుకోవాల్సిందే. మొత్తంగా హుజూరాబాద్‌ ‌బై ఎలక్షన్‌ ‌ఫలితంతో రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రంలో అనేకమార్పులు, సమీకరణలు తీసుకు రానున్నాయనీ తెలుస్తుంది.

Leave a Reply