Take a fresh look at your lifestyle.

విద్యా వ్యవస్థను బలోపేతానికి.. దీర్ఘకాలిక వ్యూహం రూపొందిస్తాం

పాఠశాలల పున:ప్రారంభంపై త్వరలోనే నిర్ణయం
కస్తూరిబా విద్యార్థినుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది
విద్యాశాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌

విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. దీనికోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేవం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పాఠశాలల పున:ప్రారంభం ఎప్పుడు చేయాలి విడ్యా బోధన ఎలా జరగాలి ? అనే అంశాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్దతిని పరిశీలించి రాష్ట్రంలో ఏం చేయాలనే విషయంపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. కొరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యా సంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్‌ ‌తదితర అంశాలపై యూజీసీ, ఏఐసీటీఈ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు. కోరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలు, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసే అంశాలపై సీఎం గురువారం ప్రగతి భవన్‌లో విస్త•తస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ ‌సోమేష్‌కుమార్‌, ‌విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ‌ప్రొ.పాపిరెడ్డి, సీనియర్‌ అధికారులు నవీన్‌ ‌మిట్టల్‌, ఉమర్‌ ‌జలీల్‌, శ్రీ‌హరి, శేషుకుమారి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల పనితీరును గణనీయంగా మెరుగుపరచి అత్యుత్తమ విద్యా బోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడీని అరికట్టడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఒక్కో రంగంపై దృష్టి సారించి క్రమంగా సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తున్నామనీ, ఇందులో భాగంగా ఇప్పటి వరకు విద్యుత్‌ ‌సమస్య పరిష్కారమైందనీ, మంచినీటి గోస తీరిందనీ, సాగునీటి సమస్య పరిష్కారమవుతున్నదనీ, వ్యవసాయ రంగం కుదుటపడుతున్నదని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో భూకబ్జాలు లేవు, గుడుంబా బట్టీలు ఆగిపోయాయి, ఇక రెవెన్యూ శాఖ ప్రక్షాళన, విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి సారిస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్‌, ‌డిగ్రీ కళాశాలలు, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి ? వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై త్వరలోనే ఓ వర్క్ ‌షాప్‌ ‌నిర్వహించి విద్యా రంగ నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం అనాథ ఆడ పిల్లలు పదో తరగతి వరకు కస్తూరిబా పాఠశాలల్లో చదువుతున్నారనీ, ఆ తరువాత వారి చదువుకు కావాల్సిన ఏర్పాట్లు చేసే విషయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందనీ, ఈ విషయంపై త్వరలోనే విధాన నిర్ణయం ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు. కేసీఆర్‌ ‌కిట్స్ ‌పథకంతో పాటు ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలు పెంచడం పేదలకు ఉపయోగపడిందనీ, అదే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందనీ, దోపిడీ ఆగిపోతుందనీ, పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ పవిత్రతను కాపాడే ఉద్దేశ్యంతో యుజిసి, ఏఐసిటిఇ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ ‌ఫైనలియర్‌ ‌విద్యార్థులకు పరీక్షలను నిర్వహించాలనీ, మిగతా వారిని ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్‌ ‌చేయాలని ఆదేశించారు. ఆగస్టు 17 నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ‌విద్యా సంవత్సరం ప్రారంభించాలనీ, విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందిస్తుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌చెప్పారు.

 

Leave a Reply