Take a fresh look at your lifestyle.

ప్రజా సమస్యల పరిష్కారనికే ఫోన్‌ ఇన్‌ ‌ప్రోగ్రాం జిల్లా కలెక్టర్‌ అనితారాంచంద్రన్‌

‌భువనగిరి, మే11 (ప్రజాతంత్ర జిల్లా ప్రతినిధి) ప్రజా సమస్యల పరిష్కారానికి ఫోన్‌ ఇన్‌ ‌ప్రోగ్రాం ద్వారా తగు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ ‌తన చాం బర్‌ ‌నుండి ఫోన్‌ ‌ప్రోగ్రాం నిర్వహించి 49 మంది లబ్ధిదారుల నుండి పలు సమస్యలు నమోదు చేసుకున్నట్లు ఆమె తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శ కాల మేరకు బియ్యం, నగదు పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ అర్జీదారులకు వివరించారు.

ఈ విషయంలో ఏడు అర్జీలు, రేషన్‌ ‌కార్డుల గురించి మరో  రెండు అర్జీలు రాగా, పట్టాదారు పాసు పుస్తకాలు, రెవెన్యూ రికార్డుల సవరణ, పిల్లాయిపల్లి కాలువ పెండింగ్‌ ‌నష్టపరిహారం చెల్లింపు, కరోనా కట్టడిలో దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకపోవడం, రైతు బంధు పథకం, ప్రైవేటు ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించకపోవడం మరో 34 మంది తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ‌జి.రమేష్‌, ‌డిఆర్వో విజయ కుమారి, పర్య వేక్షకులు భారతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply