Take a fresh look at your lifestyle.

రాష్ట్ట్రానికి రావాల్సిన.. నిధులు విడుదల చేయండి

  • మామునూరును ఉడాన్‌ ‌పథకంలో చేర్చండి
  • ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్దీప్‌ ‌సింగ్‌ ‌పూరీని కలిసిన మంత్రి కెటిఆర్‌

‌తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె. టి. రామారావు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు నిర్మన్‌ ‌భవన్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ, పుర పాలక శాఖ మంత్రి హర్దీప్‌ ‌సింగ్‌ ‌పూరిని కలిసి రాష్ట్ర పురపాలక అంశాలపై చర్చించారు. మంత్రి కేటీర్‌ ‌చెప్పింది విని అక్టోబర్‌లో మరో దఫా ఢిల్లీకి రమ్మని కేంద్ర మంత్రి హర్దీప్‌ ‌సింగ్‌ ‌పూరి ఆహ్వానించారు. వివరాల్లోకి పోతే..కేంద్ర పౌర విమానాయానం, హౌసింగ్‌ ‌శాఖ మంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించి పురపాలక శాఖ చేపట్టిన పలు అంశాలు చాలా లోతుగా కేంద్ర మంత్రి హర్దీప్‌ ‌పూరితో చర్చించానని మంత్రి కెటిఆర్‌ ‌మీడియాకి చెప్పారు. సుదీర్ఘంగా చర్చించిన అంశాలపై డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అధికారులను పిలిచి కేంద్ర మంత్రి నోట్‌ ‌రాసుకోమని అడిగారని, అదే సందర్భంలో మరో దఫా అక్టోబర్లో కలుద్దామని చెప్పారని కేటీర్‌ ‌మీడియాకి తెలిపారు. రాష్ట్రంలో పట్టణాలను ప్రణాళికాబద్ధమైన తీరులో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని, ముఖ్యంగా పౌరుడు కేంద్రంగా రాష్ట్రంలో మున్సిపాలిటీలు పౌర సేవలను అందించే దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌సారథ్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రికి తెలిపానని తెలిపారు.

రాష్ట్రానికి రావాల్సిన పలు నిధులు గురించి తెలిపానని చెబుతూ వివరాలు వెల్లడించారు. తెలంగాణ నూతన పురపాలక చట్టం గురించి తెలుపుతూ స్వచ్ఛ భారత్‌ ‌ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులు, అమృత్‌ ‌పథకం కింద రావాల్సిన నిధులు మంజూరు చేయమని కోరానని కేటీర్‌ ‌చెప్పారు. 15వ ఫైనాన్స్ ‌కమిషన్‌ ‌గ్రాంట్‌ 784 ‌కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రిని కే•రానని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంకోసం ఇవ్వవలసిన 1184 కోట్లు విడుదల చేయాలని, మొత్తంగా పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన 2537.81 కోట్లను మంజూరు చేయాలని అడిగానని, అలాగే వరంగల్‌ ‌మమునూరు ఎయిర్‌ ‌పోర్టును ఉడాన్‌ ‌పథకంలో చేర్చాలని కోరితే.. ఆమేరకు త్వరలో కేంద్ర బృందం పంపుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు మంత్రి కేటీర్‌ ‌వివరించారు. త్వరలో వరంగల్‌ ‌ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేటీఆర్‌ ఆశా భావం వ్యక్తం చేసారు. తెలంగాణాలో మిగతా 5 చోట్ల కూడా సర్వేలు జరుగుతున్నాయని అయితే వరంగల్‌కు రన్‌ ‌వే ఉంది కనుక ముందుగా వరంగల్‌కు విమాన సేవలు అందించాలని కేంద్రమంత్రిని కోరానని కే•ఆర్‌ ‌స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!