Take a fresh look at your lifestyle.

సమగ్ర పంటలకు జిల్లా చిరునామాగా నిలవాలి : మంత్రి

ఖమ్మం సిటి, మే 30 (ప్రజాతంత్ర విలేకరి) : ఖమ్మం జిల్లా సమగ్ర పంటలకు చిరునామాగా మారాలని, ప్రతి క్లస్టర్‌ ‌పరిధిలో రైతువేదికలు విధిగా ఏర్పాటుచేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌పేర్కోన్నారు. శనివారం నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో రైతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతి ధిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లో ముందుగా ప్రభుత్వ భూములను చూసుకుని వేదికలు నిర్మించుకోవాలని, దాతలు ముందుకొ•చ్చి విరాళంగా నిర్మాణం చేసి ఇస్తే తమకు నచ్చినవారి స్మారకంగా పేర్లు పెట్టుకోవడానికి ప్రభుత్వం వెసలుబాటు కల్పిస్తుందన్నారు.రైతు చుట్లూనే ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు.

ప్రభుత్వం ఏది చేసినా రైత కోణం నుంచే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆలోచన చేస్తున్నారన్నారు. నేడు దేశానికి అన్నం పెట్టె స్థితికి తెలంగాణా చేరుకుందన్నారు.ఇది మన ప్రభుత్వం సాధించిన ప్రగతి అని పేర్కోన్నారు.సిఎం ముందుచూపుతో తెలంగాణ దశ తిరిగిందని, ఇక్కడ ఉన్న వాతావరణ, భౌగోళిక పరిస్తితులు దేశంలో ఎక్కడాలేవన్నారు. ఆరేళ్ల కెసిఆర్‌ ‌పాలనతో అభివృధ్ది వైపు కొనసాగుతుందన్నారు. వ్యవసాయం బాగుపడితే దేశం బాగుపడుతుందని వినూత్నపథకాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ‌కర్ణన్‌,ఎంఎల్‌ఏ ఉపేందర్‌రెడ్డి, కూరాకుల పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy