Take a fresh look at your lifestyle.

దేశ ప్రజలందరికీ.. కొరోనా వ్యాక్సిన్‌ ‌తొలుత వారియర్స్‌కు అందిస్తాం ప్రధాని మోడీ ప్రకటన

కొరోనా వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి రాగానే..ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామి ఇచ్చారు. ఏ ఒక్క వ్యక్తినీ విడిచిపెట్టకుండా, అందరికీ వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి తేస్తామని ప్రకటించారు. ఇటీవల బీహార్‌ ‌మ్యేనిఫెస్టోలో ప్రకటించిన సందర్భంగా విమర్శలు వొచ్చాయి. దీంతో ప్రధాని మరోమారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పై వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే తిరిగి అధికారంలోకి వొస్తే బీహార్‌ ‌ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అం‌దిస్తామని బీజేపీ హా ఇచ్చింది. ఈ హాపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటనకు ప్రాధాన్యం లభించింది. ‘వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి రాగానే…ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అం‌దిస్తాం. ఎవర్నీ మరిచిపోమని హా ఇస్తున్నా’ అని మోదీ ప్రకటించారు.

అయితే మొదట్లో త్రం కోవిడ్‌ ‌వారియర్స్ ‌పైనే సహజంగా దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. పంపిణీ విషయంలో ‘జాతీయ నిపుణుల బృందం’ ఏర్పాటైందని, వారు ఓ ప్రాథ•మ్యాన్ని నిర్దేశిస్తారని ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌ను నిల్వచేయడానికి 28,000 కోల్డ్ ‌చైన్‌ ‌పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని, దేశంలోని చివరి మూలల్లో ఉన్న వారికి కూడా వ్యాక్సిన్‌ అం‌దేలా ఏర్పాట్లు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా, మండల స్థాయిల్లో అంకిత భావంతో ఉన్న కార్యకర్తల బృందం ఉందని, పారదర్శకంగా, జవాబుదారీతనంతో వారు ఆ పనిని నిర్వర్తిస్తారని అన్నారు. వ్యాక్సిన్‌ ‌పంపిణీ విషయంలో నిపుణుల బృందం అధికారులకు తగిన సూచనలు ఇస్తుందని, ప్రతి వ్యక్తికీ అందేలా వ్యూహం రచించడంలో అధికారులకు ఈ బృందం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply