Take a fresh look at your lifestyle.

అనాధ పిల్లల హక్కుల సాధనకు

Force Member, Rotary Club former, assistant governor,To achieve the rights of orphaned children1

సమావేశంలో మాట్లాడుతున్న ప్రతినిధులు, అనాధ• పిల్లలహక్కుల సాధనకై పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న దృశ్యం

హుజురాబాద్‌ ‌మాతృశ్రీ డిగ్రీ అండ్‌ ‌పీజీ కళాశాలలో రోటరీ క్లబ్‌ ‌హన్మకొండ, ఫోర్స్ ఆధ్వర్యంలో బుధవారం అనాధ పిల్లలహక్కుల సాధనకై పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కి ముఖ్యఅతిథిగా ఫోర్స్ ‌మెంబర్‌, ‌రోటరీ క్లబ్‌ ‌పూర్వ అసిస్టెంట్‌ ‌గవర్నర్‌ ‌కాయిత ఇంద్రసేనారెడ్డి పాల్గొని అనాధ పిల్లల హక్కులపరిరక్షణ గురించి మాట్లాడుతూ తనకంటూ ఎవరు లేని అనాధ బిడ్డకు గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, క్యాస్ట్ ఇన్కమ్సర్టిఫికెట్‌ ‌లాంటివి లేవనే కారణంతో వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందించడం లేదని వారు ఆవేదనవ్యక్తం చేశారు. అనాధలుగా పుట్టిన వారికి సర్టిఫికెట్ల పేరుతో లబ్ది చేకూర లేకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సర్టిఫికెట్లు లేకుండా అనాధ బిడ్డలకు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసి ఆదుకునేలా చర్యలు తీసుకునేందుకుకృషి చేద్దామన్నారు.

దేశంలో ఉన్న సుమారు మూడు కోట్ల 85 లక్షల మంది అనాధ బిడ్డల హక్కుల సాధన కోసం జరిగే ఈసమావేశానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు సుమారు 75 దేశాలనుంచి డెలిగేట్స్ ‌వస్తున్నారన్నారు. అనాధ బిడ్డహక్కులను రక్షించడం మన బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 8, 9 తేదీలలో హైదరాబాదులోని నాగోల్‌ ‌కన్వెన్షన్‌ ‌సెంటర్‌, ‌రిసార్టస్‌లో జరిగే అనాధ బిడ్డల హక్కుల సాధనఅంతర్జాతీయ సదస్సుకు అత్యధిక సంఖ్యలో యువతీ యువకులు, మేధావులు, విద్యావేత్తలు, కళాకారులు హాజరైవిజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ‌వల్లూరి రామారావు మరియు మాధవరావు, సురేందర్‌ ‌రెడ్డి , తిరుపతి, కళాశాల అధ్యాపక బృందం మరియు రోటరీ క్లబ్‌ ‌హన్మకొండ సభ్యులు యుగెందర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Force Member, Rotary Club former, assistant governor,To achieve the rights of orphaned children

Leave a Reply