తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు.నీళ్లునిధులు, నియామకాలు అన్న నినాదాలు తెరమరుగ య్యాయని అన్నారు. దేనికోసమైతే తెలంగాణను సాధించామో ఆ లక్ష్యంనెరవేర లేదన్నారు. ఉద్యోగల కల్పలనలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజేఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 10 మందితో నిరుద్యోగ కమిటీలు, ర్యాలీలు, నిరాహారదీక్షలు చేపడుతామన్నారు. హైదరాబాద్లో భారీ ధర్నా నిర్వహిస్తామని, అసెంబ్లీని ముట్టడిస్తామని కోదండరాం పేర్కొన్నారు.