Take a fresh look at your lifestyle.

టిజెఎస్‌తో ఇంటిపార్టీ జత

kodanda ram, party symbol, match box, municipal elections

  • కలసి పోటీ చేసేందుకు అంగీకారం
  • తెలంగాణ ఉద్యమకారులకు విలువ లేదు టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొ।। కోదండరామ్‌

ప్రజాతంత్ర, హైదరాబాద్‌: ‌తెలంగాణలో ఉద్యమకారులు, ఉద్యమ ఆకాంక్షలకు విలువలేకుండా పోయిందని తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) ‌పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ఇంటి పార్టీ, టీజేఎస్‌లు మున్సిపల్‌ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్‌ఆయి. ఈ సందర్భంగా శుక్రవారం డియాతో మాట్లాడిన కోదండరామ్‌.. ‌తెలం గాణలో ఉద్యమకారులు ఐక్యత కోల్పోతున్నారని, వారందరినీ మళ్లీ ఏకతాటిపైకి తెచ్చేందుకే తెలంగాణ ఇంటి పార్టీతో చేతులు కలిపామని వెల్లడించారు.

రాజకీయాలు పూర్తిగా కలుషితం అయ్యాయని, డబ్బుతో రాజకీయాలను శాసిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం వైఫల్యం గురించి ఎవరు మాట్లాడినా ప్రతిపక్షాల అక్కసు అని కొట్టిపారేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ‌నేత, మంత్రి మల్లారెడ్డిపై వచ్చిన ఆరోపణలపై కేసీఆర్‌గానీ, కేటీఆర్‌గానీ ఎందుకు స్పందించలేదు? అని సూటిగా ప్రశ్నించారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తోందని చెరుకు సుధాకర్‌ ఆరోపించారు.

Tags: tjs party, manainti party, municipal elections 2020

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply