Take a fresh look at your lifestyle.

కొరోనా నివారణలో విఫలమైన సర్కార్‌: ‌టిజెఎస్‌ ‌నేత వెంకటేశం

కొరోనా వ్యాధిని నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని జిల్లా టిజెఎస్‌ ‌కో అర్డినేటర్‌ ‌తోడుపునురి వెంకటేశం ఆరోపించారు. ఈ మేరకు  వెంకటేశం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొరోనా కేసులు విపరీతంగా పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం హరితహారం అంటూ.. వివిధ కార్యక్రమాలతో కాలయాపన చేస్తుందన్నారు. ఆరోగ్యశాఖ మంత్రితో పాటు కేబినెట్‌ ‌మంత్రులందరూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారనీ అన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకునే వారే లేరన్నారు.

కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి నెలకు ఉచితంగా రేషను ఇస్తూ  7వేల 500రూపాయల నగదు ఇవ్వాలన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి వెంటనే కొరోనా టెస్టులు  సంఖ్య పెంచాలినీ, కొరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలనీ, చిరు వ్యాపారులను, చిరు ఉద్యోగులను ఆదుకోవటానికి ప్రత్యేక శ్రద్ద చూపాలనీ, సిఎం రిలీఫ్‌ ‌ఫండ్‌పై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలనీ తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్‌లో ఇచ్చినట్లు వెంకటేశం తెలిపారు. ఆయన వెంట  జువ్వన్న ప్రసాదు,  బైరి ప్రవీణ కుమార్‌  ‌పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!