Take a fresh look at your lifestyle.

ఆకలి – అనాథలు

అన్నపూర్ణగా అఖండకీర్తికి మారుపేరు నా భారతదేశం
అదేమిటో..?
ఎక్కడికెళ్లినా ఆకలికేకల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి

ఎంగిలిస్తరాకుల్లో బాల్యం అనాథయ్యి చెత్తకుప్పల్లో దొర్లుతున్నది
చేతగాని ముసలితనపు ఎముకలగూడు మురుగ్గాలువలపక్కన బతుకీడుస్తున్నది

దేశమేమో అభివృద్దిపథంలో
దినదినాభివృద్దిచెంది మెరిసిపోతున్నది
కుబేరులైతే ఎన్నిపత్తులొచ్చినా ఎంతమంది చచ్చిన
తమ సంపదతో ఆకాశాన్ని తాకుతున్నరు

అనాథలు అభాగ్యులు ఆకలితో అలమటిస్తనేవున్నరు
మానవత్వం మాత్రం అద్దాలమేడల్లో నిదురిస్తున్నది

నవనాగరికత మానవునికి సమయమే సరిపోదాయే
అందమైన గులాబికి కిందొక ముల్లున్నట్టె
నేటిమనిషి ధనాన్నెంత సంపాదించిన
గుండెల్లో దాచుకున్న ముల్లు హృదయసంస్కారాన్ని బందించింది

పూటగడవని దిక్కులేని దీనుల్నీ
చెత్తకుప్పల్లో అన్నంమెతుకులు తింటున్న సాయం చేయని మనుషులెందుకు?

దేశమంటే మనుషులని అందరికి తెలుసు
కా….నీ…
పక్కనే సాటిమనిషిని ఆదుకోని అందలాలెందుకు?

ఆలోచించాలందరూ…
ఆకలి చావులు లేని అన్నపూర్ణ మనదేశమని
విశ్వమంతా నినదించేలా అడుగేయాలి

అనాథలను అభాగ్యుల చేరదీస్తే చేయుతనిస్తే
దేశమేగతి బాగుపడునులే

సి. శేఖర్‌(‌సియస్సార్‌), ‌పాలమూరు, 9010480557.

Leave a Reply