Take a fresh look at your lifestyle.

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి

  • ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2470 పోలింగ్‌ ‌కేంద్రాలను ఏర్పాటు
  • సిసి కెమెరాలతో కమాండ్‌ ‌కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం
  • ఉప ఎన్నిక జరిగే ప్రాంతాల్లో నేడు ప్రభుత్వ సెలవు
  • కరోనా నిబంధనల మేరకు  ప్రత్యేక చర్యలు

తిరుపతి ఉప ఎన్నిక నేడు జరుగనుంది. ఈ మేరకకు ఎన్నికల సంఘం అన్‌ఇన ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఉదయం 7గంటలకు పోలింగ్‌ ‌ప్రారంభం కానుండగా ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ ఏర్పాట్లు చేశారు. ఉదయం 7నుంచి సాయంత్రం 7వరకు  పోలింగ్‌ ‌నిర్వహించి ఇవిఎంలను సీలు వేసి స్ట్రాంగ్‌రూమ్‌ ‌కు తరలించనున్నారు. మే 2న కౌంటింగ్‌ ‌చేపట్టి ఫలితం ప్రకటిస్తారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ‌కె.విజయానంద్‌ ‌తెలిపారు. శనివారం ఉదయం 7నుంచి రాత్రి 7గంటల వరకు పోలింగ్‌ ‌జరుగుతుందని. ఇందుకోసం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2470 పోలింగ్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో 877 సమస్యాత్మక కేంద్రాలుండగా, 1241 కేంద్రాల్లో వెబ్‌ ‌క్యాస్టింగ్‌, 475 ‌కేంద్రాల్లో వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల పర్యవేక్షణకు ముగ్గురు సీనియర్‌ అధికారులు, 816 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. జనరల్‌ అబ్జర్వర్‌గా ఐఏఎస్‌ అధికారి దినేష్‌ ‌పాటిల్‌, ‌పోలీస్‌ అబ్జర్వర్‌గా ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌కుమార్‌, ‌వ్యయ పరిశీలకుడిగా ఐఆర్‌ఏఎస్‌ అధికారి అనిల్‌కుమార్‌ను నియమించారు. ఇకపోతే  తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల వ్యయం కోసం 20,81,24,000 రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ లోక్‌సభ నియోజక వర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్నందున.. రెండు జిల్లాల కలెక్టర్లకు ఈ నిధులు వినియోగించు కొనే వెసులుబాటు కల్పించారు. రెండు జిల్లాల కలెక్టర్లు పంపే బిల్లులను ఆమోదించాల్సిందిగా చిత్తూరు, నెల్లూరు జిల్లా ఖజానా అధికారులను ప్రభుత్వం కోరింది. కాగా, ఈ ఉప ఎన్నిక కోసం గత నెల 28న రూ.50.75 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికల పక్రియకు వలంటీర్లను దూరంగా ఉంచినట్టు కలెక్టర్‌ ‌హరినారాయణన్‌ ‌వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. జిల్లాకు సంబంధించి తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 7.4 లక్షల ఓటర్లు ఓట్లేసేందుకు 1056 పోలింగ్‌ ‌స్టేషన్లలో తగిన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆయా పోలింగ్‌ ‌స్టేషన్లకు సరంజామా, మెటీరియల్‌ను శుక్రవారం పంపించారు. ఉప ఎన్నిక సందర్భంగా ఈ నెల 17న తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ ‌హరినారాయణన్‌ ‌తెలిపారు. అలాగే పోలింగ్‌ ‌కేంద్రాలు, డిస్టిబ్య్రూషన్‌ ‌సెంటర్లుగా గుర్తించిన సంస్థలకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ ‌పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓట్లేయాలని అనంతపురం రేంజి డీఐజీ క్రాంతిరాణాటాటా సూచించారు. ఎన్నికల పక్రియకు ఆటంకం కలిగించేవారు, విద్రోహుల సమాచారాన్ని డయల్‌ 100, 63099 13960 ‌నెంబర్లకు ఫోనుచేసి సమాచారమివ్వాలన్నారు.

తిరుపతి ఉప ఎన్నికకు పదిమంది అదనపు ఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, 66 మంది సీఐలు, 169 మంది ఎస్‌ఐలు, 697 మంది ఏఎ?సఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1519 మంది పీసీలు, 234 మంది ఎస్‌టీఎఫ్‌ ‌సిబ్బంది, 191 మంది హోంగార్డులు, 716 మంది సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు, సిబ్బందితో కలిపి 2913 మందితో బందోబస్తు  ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. రూట్‌ ‌మొబైల్స్ 105, ‌క్యూఆర్‌ ‌టీమ్స్, ‌స్టైక్రింగ్‌ ‌ఫోర్స్ 27, ‌స్పెషల్‌ ‌స్టైక్రింగ్‌ ‌ఫోర్స్ 13, ఎస్‌.ఎస్‌.‌టి. టీమ్స్ 8, ‌ప్లయింగ్‌ ‌స్క్వాడ్స్ 8, ఎం‌సీసీ బృందాలు 8, ఇంటర్వెన్షన్‌, ‌మహిళా ఇంటర్వెన్షన్‌ ‌టీమ్స్ 19 ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమించినా.. అల్లర్లకు పాల్పడ్డా, ప్రేరేపించినా, అబద్ద ప్రచారాలు చేసినా, నగదు, మద్యం, బహుమతులు పంపిణీచేసినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్‌ ‌బూత్‌లు, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌కేంద్రానికి అనుసంధానం చేశామన్నారు.

Leave a Reply