Take a fresh look at your lifestyle.

తిరుమలలో సాధారణంగా రద్దీ

తిరుమల, ఫిబ్రవరి 21 : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒక కంపార్టుమెంట్‌లో శ్రీవారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 61,374 మంది దర్శించుకోగా 19,691 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు వచ్చిందని తెలిపారు.

తిరుపతిలోని శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద సోమవారం రాత్రి నిర్వహించిన ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను  ఆకట్టుకున్నాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. హరికథ గానం, ఎస్వీ నాదస్వర పాఠశాల ఉపాధ్యాయులు రామచంద్ర రావు, చంద్రశేఖర్‌ ‌డోలు, నటరాజ్‌ ‌నాదస్వరం వాయిద్యాలతో మంగళధ్వని వినిపించారు. కళాశాల అధ్యాపకులు గణపతి , సుబ్రమణ్య , గురు , మృత్యుంజయ ,శివ , దుర్గ భజనలు, కపిలేశ్వర స్తోత్రం తదితర కీర్తనలను ఆలపించారు.

Leave a Reply