Take a fresh look at your lifestyle.

తిరుమల ఒక్కరోజు ఆదాయం 62లక్షలు

భక్తుల రాకపై ఆంక్షలతో తగ్గిన ఆదాయం
తిరుమల,జూన్‌ 25 : ‌కరోనాకు ముందు తిరుమల శ్రీవారా ఆదాయం కనీసం రెండు కోట్లుగా ఉండేది. నిత్యం భక్తులతో కిటకిటలాడే స్వామి వారి ఆలయం ఇప్పుడు బోసిపోయింది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. రోజుకు కనసీం 7వేల వరకుమాత్రమే భక్తులు రాగలుగుతున్నారు. దీంతో ఆదాయం కూడా భారీగా పడిపోయింది. తిరుమల, తిరుపతి దేవస్థానం ఆలయానికి బుధవారం ఒక్కరోజే సుమారు రూ. 62 లక్షల హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 9059మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించారు. ఈరోజు 6వేల మంది భక్తులకు ప్రత్యేకదర్శనం ద్వారా దర్శన అవకాశం కలుగనుందని పేర్కొన్నారు. 3750 ఉచిత టైమ్‌స్లాట్‌ ‌టోకెన్లు జారీచేసినట్లు తెలిపారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భక్తులు కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ ఆలయానికి రావాలని సూచించారు. ప్రతి రోజూ 10వేల మంది భక్తులకు మాత్రమే దర్శన అవకాశముందని తెలిపారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆలయంలో ప్రవేశం ఉంటుందని టీటీడీ అధికారులు వివరించారు.

ఇక రోజూ 13వేల మందికి దర్శనం
నేటి నుంచే అమల్లోకి రానున్న టిటిడి నిర్ణయం
తిరుమల,జూన్‌ 25 : శ్రీ‌వారి ఆలయంలో భక్తుల దర్శనాల సంఖ్యను టిటిడి క్రమంగా పెంచుతోంది. ఇప్పటికే ప్రతి నిత్యం 10వేల మంది భక్తులకు టీటీడీ దర్శనం కల్పిస్తోంది. శుక్రవారం నుంచి మరో 3వేల మందికి అదనంగా స్వామి వారి దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఈ నెల 30వ తేదీ వరకూ ప్రతి నిత్యం మరో 3 వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. జులై మొదటి వారం నుంచి దర్శనం సంఖ్యను మరింత పెంచనుంది. దర్శన సమయంలో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 9గంటలకు ఆలయాన్ని మూసివేస్తుండగా… జులై మాసంలో రాత్రి 11గంటలకు మూసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!