Take a fresh look at your lifestyle.

టిప్పణి అనాగరిక చర్య ..!

ఛత్తీస్‌గఢ్‌ ‌దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ అనుబంధ దండకారణ్య పీఎల్‌జీఏ పీపుల్స్ ‌లిబరేషన్‌ ‌గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌ ‌జరిపిన భీకర దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య 24కు చేరింది. ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లా తెర్రం పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలోని జొన్నగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నక్సలైట్లలో కూడా 10-12 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.నాగరిక ప్రపంచంలో హింసకు ఎవరు పాల్పడ్డా సమర్ధనీయం కాదు. అన్యాయాన్ని న్యాయంతోనే కాదు ,అన్యాయం తో కూడా ఎదుర్కోవచ్చెనే సూత్రాన్ని మావోయిస్టులు నమ్ముతారనీ ..ఈ వైఖరి అనాగరికమయినది..

 

ఏ నాగరిక రాజకీయ ప్రక్రియ లో నూ భాగం  కాకూడదని మానవ హక్కుల ఉద్యమకారుడు కె. బాలగోపాల్ అభిప్రాయం. దాడిలో మృతి చెందిన అమరజవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా నివాళులర్పిస్తూ అమరులయిన జవాన్ల త్యాగాలు వృధా కానివ్వం ..మావోయిస్టుల పై పోరు ఉధృతం చేస్తాం అనడం ఏ నాగరిక రాజకీయ ప్రక్రియ లో భాగమో ఆలోచించాలి ..కన్నుకు కన్ను ..పన్నుకు పన్ను వైఖరి సభ్య సమాజంలో వాంఛనీయం కాదు. మావోయిస్టుల అంశం శాంతి భద్రతల సమస్యగా కాకుండా ..రాజకీయ కోణంలో ఆలోచించినప్పుడే సమస్యకు పరిష్క్రారం దొరికే అవకాశమున్నది. గత 4 దశాబ్దాలుగా ఈ సమస్యకు ముగింపు పలుకుతామని ప్రస్తుత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు ముందు ఆ పదవి లో ఉన్న ప్రతి ఒక్కరూ హింస జరిగిన ప్రతి సందర్భంలో నూ అన్న మాటలివే ..! మావోయిస్టులు తమ ఆధీనంలో ఉన్న రాకేష్ సింగ్ అనే జవాన్ ను మానవీయ కోణంలో వెంటనే విడుదల చేయాలి.

Leave a Reply