Take a fresh look at your lifestyle.

టిప్పణి ఇది నా ‘భారతం..’

హై కోర్టు ఆదేశాలతో కొరోనా వైరస్‌ ‌విస్తరణ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాత్రి కర్ఫ్యూ కంటే ముందే..పలు గ్రామాలు, మండలాలు, వ్యాపార సంఘాలు స్వీయ లాక్‌ ‌డౌన్‌ను ప్రకటించుకున్నాయి.బుధవారం నుంచి రాష్ట్రంలో సినిమా హాళ్లు, మల్టీ ప్లెక్స్‌లు పాక్షికంగా మూసివేయాలని సినీ నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శకులు ఏకగ్రీవంగా నిర్ణయించారు.ఈ సారి కొరోనా వైరస్ వ్యాప్తి యువకుల వల్లే జరిగిందనీ..కోవిడ్ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా రాత్రిళ్లు తిరగడం వల్ల కుటుంబ సభ్యులకు కూడా సోకిందనీ…అందుకోసమే రాత్రి కర్ఫ్యూ విధించడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ అధికారులు సమర్థించుకుంటున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడుతూ ..

పోరలు గ్రూపులుగా ఏర్పడి కర్రలు పట్టుకొని ఊర్లల్లకు, ఇండ్లల్లకు, మనుషులల్లకు కొరోనా జొరపడకుండా పహారా కాయాలని పిలుపునిచ్చారు..!! మరో వైపు..రాష్ట్ర ఎన్నికల సంఘం మునిసిపల్‌ ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తూ..ప్రచార సమయాన్ని మాత్రం కుదించింది. ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌ ‌రావుకు కొరోనా కేవలం నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న కారణంగానే అన్నది సుస్పష్టం ..! మంగళవారం కోవిడ్‌ ‌బారిన పడ్డ కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ విస్తరిస్తున్న కొరోనా వైరస్‌ ‌దృష్ట్యా బాధ్యత గల నాయకునిగా రెండు రోజుల క్రితం బెంగాల్‌లో జరుగుతున్న ఎన్నికల పార్టీ ప్రచారాన్ని విరమించుకున్నారు.

వారం రోజుల క్రితం కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ కూడా అన్ని రాజకీయ కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరో వైపు దేశ ప్రధాని శనివారం బెంగాల్‌లో జరిగిన ఒక ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ..ఇంత భారీ సంఖ్యలో ప్రజలను ఎన్నడూ చూడలేదని..కొరోనా వైరస్‌ ‌విస్తరిస్తున్న సమయంలో మోడీ ఆనందం వ్యక్తం చేయడం ఆయన విజ్ఞతకే వొదిలేద్దాం ..! దేశవ్యాప్తంగా కొరోనా వైరస్ స్వైర విహారం కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా మంగళ వారం 3 లక్షల దగ్గరగా 2,95,041 పాజిటివ్ కేసులు నమోదు కాగా ..తెలంగాణాలో 6542 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Leave a Reply