Take a fresh look at your lifestyle.

ఉద్యమ శక్తులు ఏకం కావాలి..!

వరంగల్, ఖమ్మం,నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్
తెలంగాణ రాష్ట్ర సాదన కోసం అవిశ్రాంతంగా  కోట్లాడినోల్లం, రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతదని ఆశించినం..కాని అనాడు రాష్ట్రం ఏర్పాటు కు ఎదురు తిరిగిన దోపిడి దొంగల పాలైందని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేసారు. సోమవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  తెలంగాణ జన సమితి  పార్టీ కి శాశ్వత సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసిన రంగారెడ్డి జిల్లా  పూర్వ జెఏసి చైర్మైన్, తెలంగాణ జన సమితి రైతు సంఘం రాష్ట్ర అద్యక్షుడు వెదిరె చల్మారెడ్డి , దారా సత్యంను మరియు రంగారెడ్డి జిల్లా మరియు చేవెళ్ల జనసమితి పార్టీ నాయకులకు కండువా కప్పి తెలంగాణ ఇంటి పార్టీ లోకి రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్  ఆహ్వనించారు.ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ మాట్లాడుతు మాకు కోదండరాం కు ఏలాంటి వైషమ్యం లేదని ఆయన అంటే మాకు గౌరవమని,టి.ఆర్.ఎస్ కు నేను రాజీనామా సందర్భంలో నేను కలిసిన మొదటి వ్యక్తి  కోదండరామే అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమని అనాడే కోదండరాం కు గుర్తు చేసానని వారన్నారు.తదనంతరం కూడ అనేక కార్యక్రమలలో పాలుపంచుకున్న వేదికలు అనేకం వున్నాయన్నారు. ఇటివల కాలంలో సంవత్సరం క్రితం  కలిసి పనిచేద్దామని కూడ నిర్ణయించుకున్నామన్నారు.ఆ సందర్భంలోనే నేను నల్లగొండ వరంగల్ ఖమ్మం  పట్టభద్రుల ఎమ్.ఎల్.సి గా పోటి చేస్తానని మీరు నాకు సహకరించాలని కోదండరాం ని కోరడం జరిగిందని గుర్తు చేసారు.ఇప్పుడు కూడ కోదండరాం నా పట్టభద్రుల (ఖమ్మం,వరంగల్, నల్లగొండ)ఎమ్.ఎల్.సి ఎన్నికకు  సహకరిస్తారనే బలమైన విశ్వాసం వుందన్నారు.కోదండరాం హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి పట్టభద్రుల బరిలో నిలబడాలని మేము కూడ సహకరిస్తామని చెరుకు సుధాకర్ విజ్ఞప్తి చేసారు.కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే ,ఉద్యమ ద్రోహుల నుండి రాష్ట్రం కాపాడబడాలంటే ఉద్యమ శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.పట్టభద్రులు పట్టం కట్టడానికి సిద్దంగా వున్నారన్నారు.ఉద్యమ శక్తులు విచ్చినం కావొద్దొనేదే నా బలమైన ఆకాంక్ష వారన్నారు.త్వరలోనే చెల్మారెడ్డి నాయకత్వంలో  పట్టభద్రుల వద్దకు మూడు జిల్లా లో యాత్ర చేపడతామని వారన్నారు.
ప్రశ్నించే గొంతుక డాక్టర్ చెరుకు సుధాకర్ ని శాసనమండలి కి పంపుతాం
వెదిరే చల్మారెడ్డి
తెలంగాణ ఉద్యమ నాయకులు వెదిరె చల్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాదనలో కోదండరాం  పాత్ర అబినందించదగిన విషయమన్నారు.రాష్ట్ర ఏర్పాటు అనంతరం కోదండరాం లో హిడెన్ ఎజెండా పొందుపర్చుకున్నాడని వారన్నారు. ఆయన అంటే మాకు వ్యక్తి గతం గా కోపం ద్వేషం లేదన్నారు. కోదండరాం కు రెండు ఎజెండాలు వున్నాయని ఒకటి అంతర్గతం‌,మరొకటి బాహ్య ఎజెండా అని దానితోనే ఒంటెద్దు పోకడతో ముందుకు పోతున్నాడన్నారు.అందరి అభిప్రాయాలు వింటాడు కాని తుది నిర్ణయం ఆయనే తీసుకుంటాడని అది ప్రజాస్వామ్య సంస్కృతి కాదన్నారు. జన సమితి పార్టీ ఎజెండా సామాజిక తెలంగాణానే కదా.!కోదండరాం  బడుగు బలహీన వర్గాలకు చెందిన ఉద్యమ నాయకుడైన డాక్టర్ చెరుకు సుధాకర్ కి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదన్నారు. ఇది కోదండరాం విశ్వరూపం అన్నారు. కోదండరాం  ఆయన దగ్గర వున్న ముగ్గురు నలుగురు వ్యక్తులు చెప్పే చెప్పుడు మాటలతోనే ఆగమవుతున్నారని వారన్నారు.కోదండరాం ఆత్మ విమర్శ చేసుకొని స్థానికుడైన  డాక్టర్ చెరుకు సుధాకర్ కి  మద్దతివ్వాలన్నారు.ఆయన గెలుపు కు సహకరించాలన్నిరు.అన్ని పార్టీలు ఎన్నికలప్పుడు వచ్చే దుకాణాలేన్నన్నారు.చెరుకు సుధాకర్ మాత్రం తెలంగాణ సమాజం పట్ల వున్న ప్రేమతో,నిబద్దతతో నిరంతరం ఉద్యమ శక్తులను ఏకం చేయడానికి సామాజిక తెలంగాణ కై కృషి చేస్తున్నారని అందుకే తెలంగాణ ఇంటి పార్టీ లో చేరుతున్నాని వెదిరే చల్మారెడ్డిగారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  ప్రకటించారు.శాసనమండలికి చెరుకు సుధాకర్ గారిని పంపుతామని అందుకోసం అవిశ్రాంతంగా పనిచేస్తామని వారన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బైరు శేఖర్, రాష్ట్ర కార్యదర్శి సంఘం రామయ్య,హైదరాబాద్ జిల్లా అద్యక్షులు కుందూరు దేవేందర్ రెడ్డి, యువజన విబాగం రాష్ట్ర అద్యక్షులు సందీప్ చమార్,కార్మిక విబాగం అద్యక్షులు గాదెపాక క్రిష్ణ,కార్మిక విబాగం ఉపాద్యక్షులు శంభు లింగం,ముక్కాముల శ్రీనివాస్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply