Take a fresh look at your lifestyle.

జిల్లా ప్రజలను భయపెడుతున్న పిడుగులు

ఖమ్మం సిటి, జూన్‌ 3 (‌ప్రజాతంత్ర విలేకరి) : వర్షాకాలం అంటే వర్షం తో పాటు మెరుపులు,ఉరుములు సర్వసాధారణంగా ఉండేవి. కాని ఇటీవల కురుస్తున్న వర్షాల సందర్బంలో ఉరుములు భీకర శభ్దాలు చేస్తూ తలమీదే పడ్డట్టు ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు కారణమౌతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల చాలా మరణాలు పిడుగులు పడి జరిగినవి ఉండటంతో ప్రజలు పిడుగుల శబ్దం మొదలవ్వగానే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. ఇక వ్యవసాయ పనులపై పోలాలకు వెళ్లేవారు, ప్రయాణాల్లో ఉన్నవారి ఆందోళన గురించి చెప్పాల్సిన పనిలేదు. వర్షం పూర్తిగా తగ్గేవరకు ఈ ఉరుములు పెళపెళమని శబ్దం చేస్తూ చంటిపిల్లల నుండి వృధ్దుల వరకు అందర్నీ వణికిస్తున్నాయి.

ఇటీవల రొంపిమల్ల ఎస్సీకాలనీ వెనుక ఉన్న పొలాల్లో సాయంత్రం 6 గంటల సమయంలో వర్షంకురుస్తున్న సందర్బంలో అందరూ చూస్తుండగానే పిడుగుపాటుకు మూడు తాటిచెట్టు కాలిపోయిన సంఘటన సామాజిక మాధ్యమాలతోపాటు ప్రసార,ప్రచార సాధనాల్లో విరివిగా వచ్చింది. ఇదే సందర్బంలో నేలకొండపల్లి మండలం అమ్మగూడెం సమీపంలో తాటిచెట్టుపై పిడుగుపడటంతో సమీప ప్రాంతాల వరకు ఒక్కసారిగా భీతిల్లారు. గతంలో పొలాలకు వెళ్లినవారు పిడుగుపాటుకు బలి అయిన సందర్బాలున్నాయి. చివరకు మూగజీవులు కూడా పిడుగుపాటుకు చనిపోతున్నాయి.

Leave a Reply