Take a fresh look at your lifestyle.

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి

పోలీస్‌ ‌పార్టీలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 7:00 గంటల సమయంలో చర్ల పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలోని గుట్టల వద్ద జిల్లా పోలీస్‌ ‌పార్టీలకు మరియు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగగా ఈ. కాల్పులు జరిగిన అనంతరం ఆప్రదేశాన్ని తనిఖీలు నిర్వహించగా ఒక మగ మావోయిస్టు మృతదేహం మరియు ఇద్దరు మహిళా మావోయిస్టు మృతదేహాలు లభించినట్లు ఎస్పీ తెలిపారు.

అంతేకాకుండా కాల్పులు జరిగిన ప్రదేశం నుండి ఒక 8ఎఎ రైఫిల్‌, ‌బ్లాస్టింగ్‌ ‌నకు ఉపయోగించే సామగ్రి,01 కిట్‌ ‌బ్యాగు మరియు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరికొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారని తెలిపారు సమాచారంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply