Take a fresh look at your lifestyle.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

  • తల్లి కూతురు మరణంతో విషాదం
  • శుభకార్యానికి వెళ్లి వస్తుండగా అశుభం
  • రక్తసిక్తమైన మందమర్రి జాతీయ రహదారి

మందమర్రి పోలీసు స్టేషన్‌ ‌పరిధిలోని కెకె2 వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. మందమర్రి ఎస్సై శివ కుమార్‌ ‌తెలిపిన వివరాల ప్రకారం గురువారం బాకం కొమురయ్య అతని కుమారుని కొడుకు శుభకార్యానికి తన మరదలు తమ్ముడి కూతురు శుభకార్యానికి వచ్చి శుక్రవారం ఉదయం తిరుగు ప్రయాణంలో రవాణా సౌకర్యం లేక కొమురయ్య తన మరదలు సుజాతను స్వగ్రామమైన లక్షేట్టిపేటకు తరలించుటలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున నివాసమైన పెరికపల్లి నుండి బయలుదేరి లక్షేట్టిపేటకు వెళుతున్న క్రమంలో మందమర్రి కెకె ఓసిపి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢికొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారని ఎస్సై శివ కుమార్‌ ‌తెలిపారు.

వివరాల్లోకి వెళితే లక్షేట్టిపేట గోదావరి రోడ్డుకు చెందిన సుజాత (40) తన కూతురు కావ్య (19) తన బావ గారి ఇంట్లొ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మందమర్రి కెకె 2 గని వద్ద గుర్తు తెలియని వాహనం ఢికొనడంతో తల్లి కూతురుతో పాటు తన బావ కొమురయ్య మృతి చెందడంతో అటు లక్షేట్టిపేటతో పాటు తాళ్ళగురిజాల మండలం తుర్కపల్లికి చెందిన ముగ్గురు చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సుజాత భర్త స్థానికంగా ఉండకపోవడంతో అతని రాకకోసం స్థానికులు రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్త చేస్తున్నట్లు ఎస్సై శివ కుమార్‌ ‌తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply