జన్నారం ఫారెస్ట్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు పారెస్ట్ బీట్ అధికారులను సస్పెండ్ చేసినట్లు జన్నారం ఎపిడివో మాధవరావు తెలిపారు. మంగళవారం రోజున అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత శుక్రవారం రోజు రాత్రి హాజీపూర్ సమీపంలోస్టేట్ పోలీస్ విజిలెన్స్ టీం పట్టుకున్న కలప విషయంలో తాళ్ళపేట బీట్ అధికారి ముజీబోద్దీన్తో పాటు పైడిపల్లి,దండేపల్లి బీట్ అధికారులు అత్తె సత్తయ్య,సాగర్లను సస్పెండ్ చేశామని అన్నారు.
బీరసాయిపేట్ రేంజ్ పరిధిలో రాంపూర్ ఉడూంపూర్ బీట్ల నుండి ఈ కలపను తాళ్ళపేటకు చెందిన దుర్గం రామయ్య అనే వ్యక్తి అక్రమంగా కారులో తరలిస్తుండగా హాజీపూర్ సమీపంలోస్టేట్ పోలీస్ విజిలెన్స్ ఆఫీసర్ పట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని కారణంగా సస్పెండ్ చేయగా పైడిపల్లి,దండేపల్లి బీట్ అధికారులు సత్తయ్య,సాగర్ల చరవానిల నుండి స్మగ్లర్లతో మాట్లాడినట్లు కాల్‌డేటా ఆధారంగా వీరిని సస్పెండ్ చేశామని తెలిపారు. జన్నారం డివిజన్ నుండి కలప స్మగింగ్ను పూర్తిగా అరికట్టామని రాత్రి వేళలో తమ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.